కొత్త లుక్ లో సాయి కుమార్ తమ్ముడు అయ్యప్ప…

Spread the love

టాలీవుడ్‌లో తన ప్రత్యేక నటనతో గుర్తింపు పొందిన విలక్షణ నటుడు పూడిపెద్ది అయ్యప్ప శర్మ ఇటీవల చేసిన మేకోవర్‌ సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. దాదాపు పద్నాలుగు సంవత్సరాల పాటు ఒకే రఫ్‌ అండ్‌ టఫ్‌ లుక్‌ను కొనసాగించిన ఆయన, ఇప్పుడు పూర్తిగా స్టైలిష్ గా  కనిపిస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నారు. ఎప్పుడూ పొడవాటి జుట్టు, గుబురు గడ్డం, సీరియస్ లుక్తో కనిపించే అయ్యప్ప శర్మ… ఇప్పుడు క్లీన్‌ షేవ్‌తో, నీట్ హెయిర్‌స్టైల్‌తో ఒక సిన్సియర్ పోలీస్‌ అధికారిలా కనిపిస్తున్నారు. కన్నడంలో తెరకెక్కుతున్న ‘పబ్బార్’ చిత్రంలో అయ్యప్ప శర్మ ఒక పవర్‌ఫుల్‌ ఎస్పీ పాత్రను పోషిస్తున్నారు. ఈ పాత్రకు అవసరం ఐన లుక్ కోసం తన పాత ఇమేజ్‌ను పూర్తిగా పక్కన పెట్టి కొత్త లుక్‌ను ట్రై చేసాడు. సాధారణంగా ఒక నటుడు 10  ఇయర్స్ పాటు కొనసాగించిన లుక్‌ను ఒక్కసారిగా మార్చుకోవడం అంత సులభం కాదు. కానీ పాత్రకు న్యాయం చేయాలనే ఆత్మవిశ్వాసం, నటనపై ఉన్న అంకితభావం కారణంగా అయ్యప్ప శర్మ వెనుకాడలేదు. అందుకే ఈ మార్పును సినీ వర్గాలు ప్రశంసిస్తున్నాయి.అయ్యప్ప శర్మ కెరీర్‌ను పరిశీలిస్తే, ముఖ్యంగా విలన్‌ పాత్రల్లో ఆయనకు ప్రత్యేక స్థానం ఉందని చెప్పాలి. గ్రామీణ నేపథ్యంలో వచ్చే ఫ్యాక్షన్‌ డ్రామాలు, గంభీరమైన యాక్షన్‌ కథల్లో ఆయన నటన ఎప్పుడూ ప్రత్యేకంగా నిలిచింది. ఆయన కళ్ళలో కనిపించే విలనిజం, డైలాగ్‌ చెప్పే తీరు, ఇంకా గట్టి బేస్ వాయిస్ ఇవి అన్నీ కలిసి ఆయనకు ఒక ప్రత్యేక ఫ్యాన్‌బేస్‌ను తెచ్చాయి. చాలా సినిమాల్లో ప్రేక్షకులను భయపెట్టే పాత్రలు చేసినప్పటికీ, అదే సమయంలో తన నటనతో ఆకట్టుకునే శక్తి కూడా ఆయనకు ఉంది.ఆయన పేరు గుర్తొచ్చిన వెంటనే గుర్తుకు వచ్చే భారీ సినిమాల్లో కేజీఎఫ్ కూడా ఒకటి. అలాంటి గ్రాండియర్‌ ఉన్న ప్రాజెక్ట్‌లో కనిపించిన ఆయన స్క్రీన్‌ ప్రెజెన్స్‌ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు అదే నటుడు ఖాకీ యూనిఫామ్‌ వేసుకుని పోలీస్‌ అధికారిగా కనిపిస్తుండటం అభిమానులకు కొత్త అనుభూతిని ఇస్తోంది. మొత్తానికి చూస్తే, పద్నాలుగు సంవత్సరాల తర్వాత లుక్‌ మార్చుకున్న అయ్యప్ప శర్మ ఒక నటుడు తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేసాడు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *