ఏపీ డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కి బదులుగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ సవరణ బిల్లు – 2026 ను శాసనసభలో ప్రవేశపెట్టారు. ముందుగా ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అనుమతి కోరారు. సభ్యులందరూ ఏకగ్రీవంగా అనుమతిని మంజూరు చేయడంతో, డిప్యూటీ స్పీకర్ బిల్లును ప్రవేశపెట్టేందుకు అధికారికంగా అనుమతించారు. అనంతరం మంత్రి కందుల దుర్గేష్ పంచాయతీరాజ్ సవరణ బిల్లు – 2026 ను శాసనసభలో ప్రవేశపెట్టారు.