బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ తన కొత్త చిత్రం తాలూకు అప్డేట్ ను సోషల్ మీడియా వేదికగా సినీ అభిమానులతో పంచుకున్నారు. ఈ మేరకు ఆ సినిమా టైటిల్ ను ‘మాతృభూమి’ తెలుపుతూ ఆసక్తికర పోస్టర్ ను షేర్ చేశారు. దీనికి “May War Rest In Peace” అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌ను కూడా జత చేశారు.సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ బ్యానర్ పై సల్మాన్ ఖాన్ స్వీయ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాను అపూర్వ లఖియా డైరెక్ట్ చేస్తున్నారు. పవర్ ఫుల్ ఆర్మీ అధికారి పాత్రలో సల్మాన్ కనిపించనున్నారు. చిత్రాంగద సింగ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. హిమేష్ రేషమ్మియా సంగీతాన్ని అందిస్తుండగా, అర్జిత్ సింగ్ పాడిన ‘మాతృభూమి’ అనే పాట ఈ సినిమా హైలైట్‌గా నిలవనుంది. సల్మాన్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 2025లో విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల నుండి విశేష స్పందన పొందింది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. 2020లో భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన గల్వాన్ వ్యాలీ ఘర్షణల ఆధారంగా ఈ సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. గల్వాన్ పోరాటంలో వీరమరణం పొందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు పాత్రలో సల్మాన్ ఖాన్ పోషించనున్నట్లు సమాచారం.