ఇది తెలంగాణ సాహిత్యానికి దక్కిన గౌరవం

Spread the love

ప్రముఖ కవి, సాహితీవేత్త శ్రీ నందిని సిధారెడ్డి గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించడం పట్ల బీ.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.ఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు అభినందనలు తెలిపారు. తెలంగాణ మట్టి సువాసనను, ఉద్యమ స్ఫూర్తిని తన కలంతో విశ్వవ్యాప్తం చేసిన ప్రముఖ కవి, సాహితీవేత్త శ్రీ నందిని సిధారెడ్డి గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించడం అత్యంత సంతోషదాయకమని కే.టీ.ఆర్ అన్నారు. ఇది తెలంగాణ సాహిత్యానికి దక్కిన గౌరవమని వారికి హృదయపూర్వక అభినందనలు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు స్పందిస్తూ నాగేటి సాల్లల్ల నా తెలంగాణ….’ అంటూ తెలంగాణ ఆత్మను పలికించిన అక్షర యోధుడు, మన నందిని సిధారెడ్డి గారిని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించడం గర్వకారణం. తెలంగాణ అస్తిత్వాన్ని అక్షరబద్ధం చేసిన మీ కృషి వెలకట్టలేనిది. ఈ పురస్కారం మీ సాహితీ ప్రస్థానానికి దక్కిన అసలైన గుర్తింపు. మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు సర్..అంటూ ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *