శర్వానంద్ అంటే మనకి సాఫ్ట్ లవర్ బాయ్ గుర్తుకు వస్తాడు కదా… అలానే మొన్న సంక్రాంతికి నారి నారి నడుమ మురారి అని మంచి సినిమా తో వచ్చి హిట్ కొట్టాడు… స్టోరీ కూడా చాలా బాగుండడం తో కలెక్షన్స్ అదిరిపోయాయి. తన తాజా బ్లాక్‌బస్టర్ తర్వాత మరోసారి డబుల్ ఎనర్జీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘బైకర్’ సినిమా తరవాత అయన కొత్త సినిమా ‘భోగి’ ఇప్పటికే సినీ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఈ సినిమాకు సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ పోస్టర్‌లో శర్వా పూర్తిగా మాస్, రస్టిక్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఇది ఈ సినిమాలో ఉండే హై వోల్టేజ్ యాక్షన్ ఇంకా పీరియడ్ బ్యాక్‌డ్రాప్‌ను స్పష్టంగా చూపిస్తోంది. ఆ లుక్ చూస్తేనే పాత్రలో ఉన్న తీవ్రత అర్థమవుతోంది. మొత్తానికి శర్వా కూడా యాక్షన్ సినిమా చేస్తూ, ఒక కొత్త గెట్ అప్ లో కనిపించబోతున్నాడు! ఇక ఈ పోస్టర్ లో శర్వా చేతిలో ఒక ఆయుధం కూడా అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇవన్నీ శర్వా లో ని మాచో ట్రాన్స్‌ఫర్మేషన్‌ను మరింత హైలైట్ చేస్తున్నాయి. చెక్కుచెదరని బలమైన వ్యక్తిత్వాన్ని ఈ లుక్ ప్రతిబింబిస్తోంది. మొత్తంగా ఈ ఫస్ట్ లుక్ ఒక్కసారిగా సినిమా మీద అంచనాలు కూడా పెంచేసింది. శర్వా ఇప్పటివరకు చేసిన పాత్రలకు భిన్నంగా, మరింత ఇంటెన్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ పోస్టర్ తో పాటు మరో ముఖ్యమైన విషయాన్ని కూడా టీం ప్రకటించింది అదే రిలీజ్ డేట్. భోగి సినిమా ఈ ఏడాది ఆగస్టు 28న, రక్షాబంధన్ పండుగ సందర్భంగా విడుదల కానుంది. భోగి సినిమా ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్నారు. మొత్తానికి, శర్వా భోగితో మరో కొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.