టీ 20 వరల్డ్ కప్..ఆ మ్యాచ్ లు భారత్ గెలవాల్సిందే..!

Spread the love

టీ 20 వరల్డ్ కప్  2026 సూపర్ -8లో సౌతాఫ్రికా చేతిలో భారత్ 76 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం విదితమే. ఈ మ్యాచ్ పరాజయంతో భారత్ సెమీస్ అవకాశాలు కష్టంగా మారాయి. ఈ నేపథ్యంలో ఈనెల 26న జింబాబ్వేతో, మార్చి 1న  వెస్టిండీస్ తో జరగబోయే మ్యాచ్ లలో  తప్పనిసరిగా భారత జట్టు భారీ తేడాతో విజయం సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు భారత్ సెమీస్ అవకాశాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. సెమీస్ కు వెళ్లాలంటే కచ్చితంగా జింబాబ్వే, వెస్టిండీస్ తో జరిగే  మ్యాచ్ లలో విజయం సాధించాలి. అప్పుడు టీమిండియాకు 4పాయింట్లు వస్తాయి.

అలాగే సౌతాఫ్రికా కూడా మిగతా రెండు మ్యాచుల్లో గెలవాలి.అలా జరిగితే భారత్ తేలికగా సెమీస్ చేరుతుంది.ఒకవేళ సౌతాఫ్రికా వెస్టిండీస్ తో జరిగే మ్యాచ్ లో  ఓడిపోతే పరిస్థితి కాస్త కఠినమవుతుంది. అప్పుడు సౌతాఫ్రికా, వెస్టిండీస్, భారత్ ఈ మూడు టీమ్ లకు  4 పాయింట్లు ఉంటాయి. ఈ పరిస్థితుల్లో నెట్ రన్ రేట్ ను బేస్ చేసుకుని సెమీ ఫైనల్ ఆడే ఇరు జట్లను ఎంపిక చేస్తారు. ఒకవేళ సౌతాఫ్రికా మిగిలిన రెండు మ్యాచుల్లో ఓడిపోతే.. భారత్, వెస్టిండీస్ సెమీస్ కు  అర్హత సాధిస్తాయి.ఒకవేళ భారత్ వెస్టిండీస్ తో గెలిచి, జింబాబ్వేపై ఓడిపోతే అప్పుడు భారత్, జింబాబ్వే, వెస్టిండీస్ ఖాతాల్లో రెండేసి పాయింట్లు ఉంటాయి. సౌతాఫ్రికా డైరెక్ట్ గా సెమీస్ చేరుతుంది. రెండో స్థానం కోసం ఈ మూడు జట్లూ పోటీపడతాయి.అప్పుడు నెట్ రన్ రేట్ కీలకమవుతుంది. ఈ పరిస్థితుల్లో సౌతాఫ్రికా తన రెండు మ్యాచుల్లోనూ ఓడిపోతే భారత్ సెమీస్ ఆశలు గల్లంతే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *