డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ ఆధునికీకరణ పనులకు మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వర్చువల్ గా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. శంకర గుప్తంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాజోలు ఎమ్మెల్యే దేవ వర ప్రసాద్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్, జల వనరుల శాఖ అధికారులు పాల్గొన్నారు. కోనసీమ కొబ్బరి రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రూ. 20.77 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పనులకు శ్రీకారం చుట్టారు. రాజోలు పర్యటనలో 45 రోజుల్లో శంకరగుప్తం డ్రెయిన్ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ 35 రోజుల్లోపే సమస్యకు పరిష్కారం చూపారు. దీంతో ఆ ప్రాంత ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.