టైమ్ మెషీన్‌లో వెళ్లి ‘వింటేజ్ చిరంజీవి’ని చూస్తారు:- అనిల్ రావిపూడి

Spread the love

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా,అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మన శంకరవరప్రసాద్‌ గారు’ చిత్ర ట్రైలర్‌ను ఆదివారం తిరుపతిలో అత్యంత వేడుకగా విడుదల చేశారు.ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ, తిరుపతి సెంటిమెంట్‌ను గుర్తుచేసుకుంటూ, ఒక వీరాభిమానిగా చిరంజీవి గారిలోని స్వాగ్, కామెడీ టైమింగ్‌ను ఈ సినిమాలో అద్భుతంగా ఆవిష్కరించానని తెలిపారు.థియేటర్లలో ప్రేక్షకులు టైమ్ మెషీన్‌లో వెళ్లి ‘వింటేజ్ చిరంజీవి’ని చూసిన అనుభూతిని పొందుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో, నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ మల్టీస్టారర్ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.అయితే అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ  సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది.సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మెగా రైడ్‌కు సిద్ధమైంది.