2025లో రికార్డ్ స్థాయి విక్రయాలు.. దేశంలోనే నెంబర్ 2గా మహీంద్రా 

Spread the love

భారత కార్ల మార్కెట్‌ లో మహీంద్రా కంపెనీ రికార్డ్ స్థాయి విక్రయాలతో దూసుకుపోతోంది. తాజాగా మరో  సూపర్  రికార్డు నమోదు చేసింది. 2025 సంవత్సరానికి మహీంద్రా తొలిసారి ఒకే సంవత్సరంలో 6 లక్షలకు పైగా వాహనాలు విక్రయించి దేశంలో రెండో అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా నిలిచింది. ఇప్పటి వరకు ఈ స్థానం టాటా మోటార్స్ దగ్గర ఉండేది. కానీ ఈసారి మహీంద్రా టాటాను దాటిపోయి, మారుతి సుజుకి తర్వాతి స్థానాన్ని దక్కించుకుంది. హ్యుందాయ్ నాలుగో స్థానంలో నిలిచింది. 2025లో మహీంద్రా మొత్తం 6,25,603  వెహికల్స్ ను విక్రయించింది. ఇది గత ఏడాదితో పోలిస్తే చాలా  అధికం. అంటే ఆ కంపెనీపై ప్రజల నమ్మకం ఎంత పెరిగిందన్న దానికి ఇది ఓ నిదర్శనం. అక్టోబర్ నెల అయితే మహీంద్రాకు స్పెషల్‌గా మారింది. ఒక్క నెలలోనే 71,624 వెహికల్స్ విక్రయించి  ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది.