‘విరోష్’ సందడి..హ్యాపీగా ఫీల్ అవుతున్న ఫ్యాన్స్

Spread the love

ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ..నటి రష్మిక మంథనల వివాహం ఈనెల 26న జరగనున్నట్లు తెలుస్తోంది. వీటి అభిమానులు ఈ జంటను ‘విరోష్’ అని పిలుస్తున్నారు. కాగా,  ఇప్పటికే రెండు కుటుంబాలు, బంధువులు, స్నేహితులు ఉదయ్ పూర్ చేరుకున్నట్లు సమాచారం.  ఈ నేపథ్యంలో తాజాగా వీరిద్దరూ సోషల్ మీడియాలో పెట్టిన  ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అభిమానులు తమ అభిమాన జంట పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

స్విమ్మింగ్ పూల్ ఫొటోను విజయ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక డైనింగ్ టేబుల్ పై గ్రీన్ థీమ్ తో  ఉన్న డిన్నర్ మెనూ ఫొటోను రష్మిక షేర్ చేశారు. దానిపై విరోష్ అని రాసి ఉండడం ఆకట్టుకుంది. నేటి నుంచి వీరి పెళ్లి వేడుకలు ప్రారంభం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈరోజు సంగీత్, మెహందీ వేడుక, రేపు హల్దీ, ఫిబ్రవరి 26నపెళ్లి జరగనున్నట్లు సమాచారం. కేవలం కొంతమంది సన్నిహితులు మాత్రమే హాజరవుతున్నారని తెలుస్తోంది. ఇక వీరిద్దరూ ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ వంటి చిత్రాలతో హిట్ పెయిర్ గా ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *