మన శంకరవరప్రసాద్ గారు” చిత్రంకి ప్రేక్షక దేవుళ్లు చూపిస్తున్న ఆదరణ మరియు అపూర్వమైన విజయాన్ని చూస్తుంటే తన మనసు కృతజ్ఞత భావనతో నిండిపోతోందని మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. నేను ఎప్పుడూ చెప్పేది నమ్మేది ఒక్కటే నా జీవితం మీ ప్రేమాభిమానాలతో ముడిపడింది. మీరు లేనిదే నేను లేను. ఈ రోజు మళ్లీ అదే నిజమని మీరు నిరూపించారు. ఈ విజయం పూర్తిగా నా ప్రియమైన తెలుగు ప్రేక్షకులది, నా ప్రాణసమానమైన అభిమానులది, నా డిస్ట్రిబ్యూటర్లది, సినిమాకు ప్రాణం పెట్టి పనిచేసిన ప్రతీ ఒక్కరిది మరియు ముఖ్యంగా దశాబ్దాలుగా నా వెంట నిలబడి ఉన్నవారందరిది. వెండితెర మీద నన్ను చూడగానే మీరు వేసే విజిల్స్, చప్పట్లే నన్ను నడిపించే నా శక్తి. రికార్డులు వస్తుంటాయి – పోతుంటాయి, కానీ మీరు నాపై కురిపించే ప్రేమ మాత్రం శాశ్వతం.ఈ బ్లాక్బస్టర్ విజయం వెనుక ఎంతో కృషి చేసిన మా దర్శకుడు HIT MACHINE అనిల్ రావిపూడికి, నిర్మాతలు సాహు & సుస్మితలకు, అలాగే మొత్తం టీమ్ అందరికీ, నాపై మీరందరూ చూపిన అచంచలమైన నమ్మకానికి ధన్యవాదాలు..ఈ సంబరాన్ని అలాగే కొనసాగిద్దాం. మీ అందరికీ ప్రేమతో… లవ్ యూ ఆల్ అంటూ చిరు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.