దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో ఇండస్ట్రీయలిస్ట్ లతో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) బ్రేక్ ఫాస్ట్ సెషన్ నిర్వహించింది. ఈ సెషన్ లో ఏపీ సీఎం చంద్రబాబు, సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ, మాస్టర్ కార్డ్ సీఈఓ, కాగ్నిజెంట్ సీఈఓ తో సహా పలువురు విదేశీ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు. భారత్ కేంద్రంగా అభివృద్ధి- ఏపీ సానుకూలతలపై సీఎం చంద్రబాబు ప్రసంగించారు. దేశంలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో 25 శాతం ఏపీ ఆకర్షించినట్లు తెలిపారు. ఇంధనం, డిజిటల్ ఇన్ ఫ్రా, లాజిస్టిక్స్, తయారీ రంగాల్లో పెద్దఎత్తున పెట్టుబడుల అవకాశాలపై చర్చ జరిగింది. ఇంధనం, డిజిటల్ ఇన్ఫ్రాలో పెట్టుబడులపై నెలకొన్న అవకాశాలపై చర్చ చేపట్టారు. లాజిస్టిక్స్, తయారీ రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులకు సంబంధించి అవకాశాలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు, గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ రంగాల్లో పెట్టుబడులు, విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సులో సాధించిన పెట్టుబడులను సీఎం వివరించారు. ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను ఇండస్ట్రీయలిస్ట్ లకు తెలిపారు. స్పేస్ సిటీ, పోర్టులు, ఎయిర్ పోర్టులు, హైవే కనెక్టివిటీ అంశాలపై దృష్టి సారించినట్లు చంద్రబాబు వివరించారు.