ఫిబ్రవరి 10 నుండి 23 వరకు వైభవంగా జరిగే శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలను ఏపీ మంత్రులు అందుకున్నారు. అమరావతిలో మంత్రులకు శ్రీ కాళ హస్తీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సాదరంగా అందజేశారు. ఈ బ్రహ్మోత్సవాలకు విచ్చేసి, స్వామివార్ల కృపకు పాత్రులు కావాలని వారిని కోరినట్లు తెలిపారు. ఆహ్వాన పత్రికలను అందుకున్న మంత్రులు:శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు – రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి మరియు తిరుపతి జిల్లా ఇన్-ఛార్జ్ మంత్రి.శ్రీమతి వంగలపూడి అనిత గారు – రాష్ట్ర హోం మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి.శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారు – రాష్ట్ర స్త్రీ, శిశు మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి.శ్రీమతి ఎస్. సవిత గారు – రాష్ట్ర బీసీ సంక్షేమ మరియు చేనేత శాఖ మంత్రి. అలాగే లోకకళ్యాణార్థం జరిగే ఈ పవిత్ర ఉత్సవాలకు భక్తులందరికీ సాదర ఆహ్వానం పలికారు.