ఇకపై టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను పూర్తిగా నిలిపివేసే యోచనలో ఉన్నట్లు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్ హెచ్ ఏఐ) తెలిపింది. ఏప్రిల్ 1 నుండి పూర్తిగా డిజిటల్ పేమెంట్స్ కు మారేలా ప్రణాళికలు వేస్తున్నట్లు తెలిపింది. టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్ తో కానీ… యూపీఐతో కానీ ప్లాజా ఫీజును చెల్లించే వెసులుబాటు కల్పించనున్నట్లు స్పష్టం చేసింది. టోల్ ప్లాజాల ఫీజుల కార్యకలాపాల్ని, వాటి కెపాసిటీ పటిష్టం చేయడం, డిజిటల్ రూపంలో వచ్చిన చెల్లింపులను ఏకీకృతం చేయాలనే లక్ష్యంతో ఈ మార్పును ప్రతిపాదించినట్లు ఎన్ హెచ్ఐఏ తెలిపింది.ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు అధిక శాతం టోల్ సేకరణ ఇప్పటికే ఫాస్టాగ్ ద్వారానే జరుగుతోంది. మిగిలిన కొద్దిపాటి నగదు లావాదేవీలను కూడా డిజిటల్ రూపంలోకి మార్చనున్నారు.