జనవరి 7న విడుదల కానున్న రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ థియేట్రికల్ ట్రైలర్!

Spread the love

మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను జనవరి 7న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇందులో రవితేజకు జోడిగా డింపుల్ హయాతి& ఆషిక రంగనాథ్ నటిస్తున్నారు.దర్శకుడు ఈ చిత్రాన్ని  ట్రైయాంగిల్ లవ్ స్టోరీతో రూపొందిస్తున్నారని తెలుస్తుంది. ఇప్పటికే విడుదలైన ‘వామ్మో వాయ్యో’ పాట సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తుండగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది.ఎస్ఎల్‌వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్, భోగి పండుగ కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.రవితేజ తనదైన కామెడీ టైమింగ్ & ఎనర్జీతో ఈ సంక్రాంతి రేసులో గట్టి పోటీనిచ్చేందుకు సిద్ధమయ్యారు.