ఇది నా జీవితంలోనే అతిపెద్ద ‘సూపర్ స్టార్’ మూమెంట్

Spread the love

దేశవ్యాప్తంగా ఒకటే మాట ‘ధురంధర్ 2’ ఈనెల 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అప్రతిహతంగా ప్రేక్షకాదరణ పొందుతూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో దూసుకుపోతోంది. కాగా, సెలబ్రెటీల నుండి కూడా ఈ సినిమాపై ప్రశంసల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే మహేష్ బాబు, అల్లు అర్జున్, రాజమౌళి సహా తదితరులంతా తమ స్పందనతో సినిమా ఎలా ఉందో చెప్పారు. ఇక తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ సినిమాపై తన స్పందన తెలిపారు. ఈమేరకు సోషల్ మీడియా ‘ఎక్స్’ లో ఒక పోస్ట్ చేశారు.  “ఏమి సినిమా అది… #Dhurandhar2‌ !!! బాక్సాఫీస్ బాప్ ఈ ఆదిత్య ధర్ !!! రణవీర్ సింగ్‌కు మరియు చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు. ప్రతి భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా ఇది. జై హింద్. అంటూ తన స్పందన తెలిపారు. ఇక ఈ పోస్ట్ కు దర్శకుడు ఆదిత్య ధర్ ప్రతి స్పందించారు. 

సార్, మేమందరం ‘వినోదం’ అంటే దానికి మీరే ఒక కొలమానంగా భావిస్తూ పెరిగాము. దశాబ్దాలుగా మమ్మల్ని ఈలలు వేయించి, నవ్వించి, ఏడిపించి మరియు జీవితాన్ని ఎంతో అద్భుతంగా ఫీల్ అయ్యేలా చేస్తూ.. ఇప్పటికీ అదే స్టైల్ మరియు హుందాతనంతో మీరు మమ్మల్ని అలరించడం ఒక స్వచ్ఛమైన మ్యాజిక్. అలాంటి మీరు ‘ధురంధర్ 2’ సినిమాని ‘తప్పక చూడాల్సిన చిత్రం’ అని పిలవడం, నా జీవితంలోనే అతిపెద్ద ‘సూపర్ స్టార్’ మూమెంట్. మా అందరికీ పెద్ద కలలు కనడం నేర్పిన వ్యక్తి నుండి పొందిన ఆశీర్వాదంగా దీనిని భావిస్తున్నాను. ఈ గౌరవానికి నా కృతజ్ఞతలు చెప్పడానికి మాటలు సరిపోవు సార్. ఇది నేరుగా నా గుండెను తాకింది.జై హింద్.అంటూ ఆదిత్య ధర్ సూపర్ స్టార్ పట్ల తన అభిమానాన్ని, కృతజ్ఞతను తెలియజేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *