ఎప్పుడూ సినిమా టైటిల్స్ విషయంలో కాస్త కొత్తగా ఆలోచిస్తూ ఉంటాడు మన దర్శకుడు అనిల్ రావిపూడి. ‘సంక్రాంతికి వస్తున్నాం’ ‘మన శంకరవరప్రసాద్ గారు’ వంటి టైటిల్స్ కొత్తదనంతో అలాగే ఆకట్టుకున్నాయి. అందుకే దర్శకుడు అనిల్ రావిపూడి సినిమాలంటే ముందుగా గుర్తొచ్చేది కామెడీ. ఆయన సినిమా టైటిళ్ల నుంచి ప్రమోషన్స్ వరకు ప్రతిదాంట్లోనూ ఒక ప్రత్యేకమైన స్టైల్ కనిపిస్తుంది. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేలా ఏదో ఒక కొత్త ఐడియాతో ముందుకు రావడం ఆయనకు అలవాటే. అందుకే ఆయన సినిమా ప్రకటించిన ప్రతిసారి కథతో పాటు టైటిల్ కూడా చర్చకు వస్తుంది. ఇప్పుడు వెంకటేష్, కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న కొత్త సినిమా విషయంలో కూడా అదే జరిగింది. ఈ సినిమాకు ‘జనవరి 12 విడుదల’ అనే టైటిల్‌ను ఖరారు చేయడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, టైటిల్‌తో పాటు ‘బావ బామ్మర్ది సౌజన్యంతో’ అనే ట్యాగ్‌లైన్ కూడా జత చేశారు. వచ్చే సంక్రాంతి బాక్సాఫీస్ పోటీ ఈసారి చాలా భారీగా కనిపిస్తోంది. ఇప్పటికే పలు స్టార్ హీరోల సినిమాలు పండుగ బరిలోకి రావడానికి సిద్ధమవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘మెగా 158’, మరోవైపు ‘సంబరాల ఏటిగట్టు’, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కుతున్న ‘మహాకాళి’, అలాగే రవితేజ-శ్రీవిష్ణు కాంబినేషన్ సినిమా, శర్వానంద్ నటిస్తున్న ‘జార్జ్ క్రిష్’, సూపర్ స్టార్ రజనీకాంత్ ‘ధర్మన్’ వంటి చిత్రాలు కూడా అదే సీజన్‌ను టార్గెట్ చేస్తున్నాయి.
ఇవి కాకుండా ఇంకా కొన్ని సినిమాలు కూడా విడుదల తేదీలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ బాలకృష్ణ నటిస్తున్న ‘బాలయ్య 111’ డిసెంబర్‌లో విడుదల కాకపోతే, అది కూడా సంక్రాంతి రేసులో చేరే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇన్ని పెద్ద సినిమాలు ఒకేసారి విడుదలైతే థియేటర్ల లభ్యత నుంచి ప్రేక్షకుల దృష్టి వరకు ప్రతిదానిపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే సినిమాలకు పోటీ మరింత పెరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో అనిల్ రావిపూడి సినిమా నిలబడాలంటే వినోదం అసాధారణ స్థాయిలో ఉండాల్సిందే.అయితే అనిల్ రావిపూడికి ఇలాంటి పోటీ కొత్త కాదు. గతంలో కూడా పెద్ద సినిమాల మధ్య తన సినిమాలను విడుదల చేసి విజయాలు సాధించాడు. ఆయన సినిమాల్లో ఉండే కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్, పండుగ వాతావరణానికి తగ్గ వినోదం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాయి.ఈసారి మాత్రం పరిస్థితి కొంచెం భిన్నంగా కనిపిస్తోంది. ఎందుకంటే పోటీ పడుతున్న సినిమాల సంఖ్య మాత్రమే కాదు, వాటి స్థాయి కూడా చాలా పెద్దది. ప్రతి సినిమా తనకంటూ ప్రత్యేకమైన హైప్‌తో వస్తోంది. మొత్తానికి అనిల్ రావిపూడి మరోసారి సంక్రాంతి బరిలోకి దిగుతున్నాడు. గతంలో ఆయనకు ఈ ఫార్ములా బాగా కలిసి వచ్చింది. ఈసారి కూడా అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందా? లేక సంక్రాంతి పోటీ ప్రభావం చూపుతుందా? అన్నది చూడాలి.