ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్‌గా కనిపించిన తేజ సజ్జ ఇప్పుడు అదే ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంటున్నాడు. ముఖ్యంగా ‘హనుమాన్’ సినిమాతో ఆయన రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన ఆ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని అందుకోవడంతో తేజ సజ్జ పేరు దేశవ్యాప్తంగా వినిపించింది. ఇప్పుడు అదే నమ్మకంతో వరుసగా డిఫరెంట్ కాన్సెప్ట్స్‌ను ఎంచుకుంటున్న తేజ, ఇక మిరాయి తో ఇంకో పెద్ద హిట్ కొట్టేసాడు. అయితే ఈ సినిమా ఇప్పుడు జపాన్ లో కూడా రిలీజ్ అవుతుంది… ‘మిరాయ్’ సినిమాకు జపాన్‌లో ఊహించని స్థాయిలో స్పందన వస్తున్నట్లు ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా అక్కడ జరుగుతున్న డే-1 అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే సినిమా మీద ఉన్న ఆసక్తి ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. జపాన్ మార్కెట్‌లో భారతీయ సినిమాలకు ఇటీవల మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాలు అక్కడ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. సాధారణంగా మన దగ్గర భారీ హైప్ ఉన్న సినిమాలు విదేశీ మార్కెట్లలో కూడా బుకింగ్స్ సాధించడం కొత్తేమీ కాదు. కానీ జపాన్ విషయానికి వస్తే కొన్ని సినిమాలకు మాత్రమే అక్కడి ప్రేక్షకుల నుంచి ప్రత్యేకమైన రెస్పాన్స్ కనిపిస్తుంది. అలాంటి మార్కెట్‌లో తేజ సజ్జ ‘మిరాయ్’ తన సత్తా చూపించడం ఆసక్తికరంగా మారింది. సినిమా విడుదలకు ఇంకా సమయం ఉండగానే డే-1 అడ్వాన్స్ బుకింగ్స్‌లో ‘మిరాయ్’ ఇప్పటికే పలు భారీ భారతీయ చిత్రాలను వెనక్కి నెట్టిందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం జపాన్‌లో అత్యధిక డే-1 అడ్వాన్స్ బుకింగ్స్ సాధించిన భారతీయ సినిమాల జాబితాలో ‘మిరాయ్’ టాప్-10లో చోటు సంపాదించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ఏడో స్థానంలో కొనసాగుతోందని సమాచారం. విడుదలకు ఇంకా రెండు రోజులు సమయం ఉండటంతో బుకింగ్స్ మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంటే విడుదలకు ముందు చివరి గంటల్లో బుకింగ్స్ పెరిగితే ‘మిరాయ్’ మరింత పైకి వెళ్లే ఛాన్స్ ఉందన్నమాట. అదే జరిగితే తేజ సజ్జ కెరీర్‌లో ఇది మరో ప్రత్యేకమైన రికార్డుగా నిలిచే అవకాశం ఉంది. ఒకప్పుడు టాలీవుడ్‌లో బాల నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న హీరో.. ఇప్పుడు జపాన్ వంటి అంతర్జాతీయ మార్కెట్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డుల గురించి మాట్లాడుకునే స్థాయికి రావడం చిన్న విషయం కాదు. అసలు తేజ సజ్జ కెరీర్‌ను గమనిస్తే ఈ ఎదుగుదల వెనుక చాలా ఆసక్తికరమైన ప్రయాణం ఉంది. చిన్నతనంలోనే సినిమాల్లోకి వచ్చిన తేజ.. బాల నటుడిగా ఎన్నో చిత్రాల్లో కనిపించారు. ఆ తర్వాత హీరోగా మారినప్పుడు వెంటనే భారీ స్థాయి గుర్తింపు రాలేదు. కానీ తనకు సరిపోయే కథల కోసం ఓపికగా ఎదురుచూశారు. చివరకు ‘హనుమాన్’ రూపంలో వచ్చిన అవకాశం ఆయన కెరీర్ మొత్తాన్నే మార్చేసింది.‘హనుమాన్’ సినిమా విడుదలకు ముందు కూడా దానిపై భారీ అంచనాలు ఏమీ లేవు. కానీ సినిమా విడుదలైన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సూపర్ హీరో కథ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా సినిమాలోని కంటెంట్, విజువల్స్, కథ చెప్పిన విధానం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చాయి. దాంతో తేజ సజ్జ ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. ఇక్కడే తేజ సజ్జ తీసుకున్న నిర్ణయాలు కూడా ప్రశంసలు అందుకున్నాయి. ‘హనుమాన్’ తర్వాత అదే తరహా సినిమాలు వరుసగా చేయకుండా మళ్లీ కొత్త కాన్సెప్ట్ వైపు వెళ్లారు. తన ఇమేజ్‌ను కేవలం ఒక జానర్‌కు పరిమితం చేయకుండా భిన్నమైన కథలు ఎంచుకుంటున్నారు. ఇక మిరాయి కూడా ఒక సూపర్ హీరో సినిమా కావడం తో మంచి బ్లాక్బస్టర్ అయ్యింది. అందుకే ఇప్పుడు జపాన్ లో కూడా క్రేజ్ కనిపిస్తుంది. ఇక ఇప్పుడు మిరాయి 2 కూడా చేస్తున్నాడు.