భారతీయ సినీ చరిత్రలో విజువల్ గ్రాండియర్‌కు కొత్త నిర్వచనం ఇచ్చిన సినిమాల్లో ‘కల్కి 2898 AD’ ఒకటి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, యువ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ చిత్రం విడుదలైన వెంటనే దేశవ్యాప్తంగా భారీ స్పందన పొందింది. సైన్స్ ఫిక్షన్, పురాణాల కలయికతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇచ్చింది. విజువల్ ఎఫెక్ట్స్, కథ, పాత్రల ప్రదర్శన అన్నీ కలిసి ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టాయి. బాక్సాఫీస్ వద్ద కూడా ఈ చిత్రం అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ సినిమా చివర్లో ఇచ్చిన క్లైమాక్స్ హింట్స్ ప్రేక్షకులను మరింత ఉత్సాహపరిచాయి. ముఖ్యంగా పార్ట్-2 కోసం ఇచ్చిన చిన్న చిన్న లీడ్స్ అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచాయి. కథలో మహాభారతానికి సంబంధించిన అంశాలను చూపించిన విధానం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే మొదటి భాగంలో మహాభారతానికి సంబంధించిన సన్నివేశాలు చాలా తక్కువ నిడివితోనే కనిపించాయి. ముఖ్యంగా కురుక్షేత్ర యుద్ధానికి సంబంధించిన కొన్ని క్షణాలు మాత్రమే చూపించడంతో ప్రేక్షకులలో మరింత ఆసక్తి పెరిగింది. ఆ సమయంలో చూపించిన యుద్ధ దృశ్యాలు, వీరుల ప్రవేశాలు అన్నీ కూడా ఎంతో గ్రాండ్‌గా కనిపించాయి. ఇప్పుడు ఈ విషయం గురించి వస్తున్న తాజా సమాచారం అభిమానులను మరింత ఉత్సాహపరుస్తోంది. త్వరలో తెరకెక్కబోయే కల్కి2 లో మహాభారతానికి సంబంధించిన ఒక భారీ ఎపిసోడ్ ఉండబోతుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సమాచారం ప్రకారం ఈ ఎపిసోడ్ దాదాపు 20 నిమిషాల పాటు ఉండబోతుందట. మొదటి భాగంలో కేవలం చిన్నగా చూపించిన కురుక్షేత్ర యుద్ధాన్ని ఈసారి మరింత విస్తృతంగా చూపించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఇందులో అశ్వత్థామ పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. ఆయన నటనకు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు లభించాయి. అలాగే తమిళ సినీ దిగ్గజం కమల్ హాసన్ కూడా ఈ కథలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రభాస్ అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రపంచ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపొందుతున్న ఈ సినిమా ద్వారా భారతీయ సినిమాను మరో రేంజ్ స్టాండర్డ్ సెట్ చేసింది. ప్రస్తుతం జరుగుతున్న పనులు అన్నీ అనుకున్నట్టుగా పూర్తయితే, వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. మొదటి భాగం సాధించిన భారీ విజయాన్ని దృష్టిలో పెట్టుకుని రెండో భాగాన్ని మరింత గొప్పగా రూపొందించేందుకు మూవీ టీమ్ కృషి చేస్తోంది. మొత్తానికి చూస్తే, కల్కి 2 కేవలం ఒక సినిమా కాదు, ఇండియన్ మూవీ వరల్డ్ లో మరో పెద్ద మైలురాయిగా నిలిచే ప్రాజెక్ట్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.