టీ 20 వరల్డ్ కప్ ఉత్కంఠ మ్యాచ్..సూపర్ ఓవర్ లో ఆఫ్ఘనిస్థాన్ పై సౌతాఫ్రికా విజయం

Spread the love

టీ 20 వరల్డ్ కప్ లో ఉత్కంఠభరిత మ్యాచ్ లో సౌతాఫ్రికా విజయం సాధించింది. విజయం దోబూచులాడిన  ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్థాన్ పై  సౌతాఫ్రికా సూపర్ ఓవర్ లో గెలిచి ఊపిరి పీల్చుకుంది. మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్థాన్  మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. రికెల్టన్ 61 (28; 5×4, 4×6), క్వింటన్ డికాక్ 59 (41; 5×4, 3×6) హాఫ్ సెంచరీలతో రాణించారు. బ్రెవిస్ (23), డేవిడ్ మిల్లర్ (20నాటౌట్) పరుగులు చేశారు. ఆఫ్ఘానిస్తాన్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్ జాయ్ 3వికెట్లు, రషీద్ ఖాన్ 2వికెట్లు, ఫజల్ హాక్ ఫరూఖీ 1 వికెట్ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన ఆఫ్ఘనిస్థాన్ జట్టు 19.4ఓవర్లలో 187 పరుగులే చేసి ఆలౌటైంది. రహ్మనుల్లా గుర్బాజ్ 84 (42; 4×4 , 7×6) టాప్ స్కోరర్. సౌతాఫ్రికా బౌలర్లలో లుంగీ ఎంగిడి 3 వికెట్లు పడగొట్టగా.. మార్కో యెన్సన్, కగిసో రబడా, జార్జ్ లిండే, కేశవ్ మహారాజ్ లు ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇక రెండు టీమ్ ల స్కోర్లు లెవెల్ కావడంతో మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారి తీసింది. మొదటి సూపర్ ఓవర్ లో ఆఫ్ఘనిస్థాన్ వికెట్ నష్టపోకుండా 17 పరుగులు చేసింది. సౌతాఫ్రికా మొదటి 5 బాల్స్ లో 11/1గా నిలిచింది. అయితే లాస్ట్ బాల్ కు స్టబ్స్ సిక్స్ కొట్టి రన్స్ సమం చేశాడు. దీంతో మరో సూపర్ ఓవర్ నిర్వహించారు. అందులో సౌతాఫ్రికా 23-0గా నిలిచింది. ఆఫ్ఘనిస్థాన్ 19/2తో నిలిచింది. దీంతో  సౌతాఫ్రికా విజయం సాధించింది.