పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ మాస్ ఎంటర్‌టైనర్‌లకు పేరుగాంచిన దర్శకుడు హరీష్ శంకర్ r తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే భారీ అంచనాలను సొంతం చేసుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు నూతన సంవత్సరం ఉగాది కానుకగా ఈనెల 19 న రిలీజ్ .కానుంది. ఇక తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను ఈనెల 14న విడుదల చేయనున్నట్లు మూవీ టీమ్ అధికారికగం ప్రకటించింది. ఈమేరకు ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ఈ పోస్టర్ లో పవర్ ఫుల్ గా గన్ పట్టుకుని పవర్ స్టార్ కనిపిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన యువ హీరోయిన్ శ్రీలీల, రాశీ ఖన్నాలు కథానాయికలుగా నటిస్తున్నారు అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని మాస్, యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు వినోదం కలిసిన కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు మేకర్స్ చెబుతున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి. తాజాగా ఈ సినిమా సెన్సార్ ప్రక్రియను కూడా పూర్తి చేసుకుంది. మొదట ఈ సినిమా మార్చి 26న విడుదల చేయాలని మేకర్స్ భావించారు. అయితే కొన్ని మార్పుల కారణంగా విడుదల తేదీని ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు ఉగాది సందర్భంగా మార్చి 19న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ టీజ్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. పవన్ కల్యాణ్ మాస్ లుక్, స్టైలిష్ యాక్షన్ సన్నివేశాలు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఇక ట్రైలర్ రిలీజ్ ను కూడా ప్రకటించేయడంతో పవన్ అభిమానులు దీని కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.