పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) విడుదలపై క్లారిటీ వచ్చేసింది.2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి ఒక మాసివ్ అప్‌డేట్ ఇచ్చారు.ఈ చిత్రం 2026 వేసవి (Summer) కానుకగా థియేటర్లలోకి రాబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ఈ పోస్టర్‌లో పవన్ కళ్యాణ్ వింటేజ్ మాస్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఎర్రటి షర్ట్ ధరించి, ఒక చేతిలో షాట్‌గన్, మరో చేతిలో వింటేజ్ రేడియో పట్టుకుని ఆయన నడిచి వస్తున్న తీరు ‘గబ్బర్ సింగ్’ రోజులను గుర్తు చేస్తోంది.ఈ చిత్రంలో పవన్ జోడిగా రాశి ఖన్నా , శ్రీలీల నటుస్తున్నారు.ఇందులో అశుతోష్ రానా ,ఆలీ,నవాబ్ షా, గౌతమీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.తాజాగా విడుదలైన న్యూ ఇయర్ స్పెషల్ పోస్టర్ సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది.ఈ సమ్మర్‌లో థియేటర్లలో కూర్చుని మాసివ్ ట్రీట్‌ను అనుభవించడానికి సిద్ధంగా ఉండండి” అంటూ మేకర్స్ ఇచ్చిన క్యాప్షన్ అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.