ఎన్టీఆర్ బరువు తగ్గడం వెనక అసలు స్టోరీ ఇదా..?

Spread the love

NTR Weight Loss Reason: నందమూరి నట వారసుడిగా ‘నిన్ను చూడాలని’ సినిమాతో తెరంగేట్రం చేసిన ఎన్టీఆర్ (జూనియర్ ఎన్టీఆర్), ‘స్టూడెంట్ నెం 1’ తో భారీ విజయాన్ని అందుకున్నారు. సినీ కెరీర్ ఆరంభం నుంచీ కాస్త బొద్దుగా కనిపించినా, ఆయన డ్యాన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లలో ఎక్కడా తగ్గకుండా, ముఖంలో కళతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ‘కంత్రీ’ సినిమా సమయానికి ఎన్టీఆర్ బరువు తగ్గినా, ముఖంలో ఆ తేజస్సు చెక్కుచెదరలేదు. ముఖ్యంగా ‘యమదొంగ’ నుంచి తారక్ లుక్ మరింత స్టైలిష్‌గా మారుతూ వచ్చింది.

తారక్ ప్రతి సినిమాకు తన పాత్రకు తగ్గట్టుగా బరువును పెంచుతూ, తగ్గిస్తూ వచ్చారు. ‘ఆర్ఆర్ఆర్’ కోసం బరువు పెరిగితే, ‘దేవర’ కోసం తగ్గారు. ఆ తర్వాత ‘వార్ 2′ కోసం మరింత బరువు తగ్గారు. ఈ మార్పులన్నిటిలోనూ ఎన్టీఆర్ ఫేస్ గ్లో ఏ మాత్రం తగ్గలేదు. కానీ, ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కోసం ఆయన బరువు తగ్గడం, ఆయన ముఖంలో మునుపటి కళ లేకపోవడం అభిమానులను ఆందోళన కలిగిస్తోంది.’వార్ 2’ ప్రమోషన్స్‌లో కొద్దిగా పర్వాలేదు అనిపించిన తారక్, ఆ తర్వాత మరింత బక్కచిక్కి కనిపించారు. ఈ హఠాత్ మార్పుతో “ఎన్టీఆర్ ఏంటి, ఇలా మారిపోయాడు? చూస్తే ఏదో అనారోగ్యంతో బాధపడుతున్న పేషెంట్‌లా కనిపిస్తున్నాడు” అనే అనుమానాలు ఎప్పటినుంచో వ్యక్తమవుతున్నాయి.

బావమరిది నితిన్ పెళ్లి వేడుకలో కనిపించిన లుక్‌కు, ఇటీవల ఒక అభిమానితో కలిసి దిగిన తాజా ఫోటోలో ఉన్న లుక్‌కు చాలా వ్యత్యాసం ఉంది. పింక్ కలర్ కుర్తాలో ఉన్న తారక్‌ను చూసి, “ఏమైంది? అంత బక్కచిక్కిపోయాడు?” అని ప్రశ్నలు వస్తున్నాయి. సన్నగా ఉన్నా ఫర్వాలేదు కానీ, ముఖంపై నిద్ర లేమితో వచ్చే వాపు కనిపిస్తోందని, చికిత్స తీసుకుంటున్న పేషెంట్‌లా కనిపిస్తున్నాడని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.సాధారణంగా ప్రశాంత్ నీల్ సినిమాలు అంటేనే హై-ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లు. అలాంటిది, ఎన్టీఆర్ ఇంతలా బరువు తగ్గడం చూస్తుంటే, ఈసారి ప్రశాంత్ నీల్ కథలో ఏదైనా కొత్త ప్రయోగం చేస్తున్నారా అనే సందేహాలు వస్తున్నాయి. NTR Weight Loss Reason.

ఈ సినిమాలోని ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లోని కీలక సన్నివేశాల కోసం ఎన్టీఆర్ బరువు తగ్గినట్టుగా ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఎపిసోడ్‌లో ఉండే పవర్‌ఫుల్ యాక్షన్ సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని, ఎన్టీఆర్ లుక్ చాలా భిన్నంగా ఉంటుందని టాక్. ప్రస్తుతం అందుకు సంబంధించిన సీక్వెన్స్ షూటింగ్‌ జరుగుతున్నట్టు తెలుస్తోంది. మరో వెర్షన్ ప్రకారం, తాజా లుక్‌తో రెండో వెర్షన్‌ను తెరకెక్కిస్తున్నట్టుగా పరిశ్రమలో చర్చ ఉంది. మొన్నటి వరకు క్లీన్ షేవ్‌లో కనిపించిన తారక్, ఇటీవల ఫుల్ బియర్డ్‌తో కనిపిస్తున్నారు. ప్రస్తుత లుక్‌తో భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారట నీల్. ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ గురించి ఇండస్ట్రీలో ఇప్పటికే గట్టి చర్చ నడుస్తోంది.మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానుంది.