ఎంత ఊహించుకున్నా… దాన్ని మించి ‘పెద్ది’ ట్రైలర్..మెగాస్టార్ రెస్పాన్స్

Spread the love

తెలుగు సినిమాకు కొంత గ్యాప్ తరువాత రాబోతున్న పెద్ద సినిమా ‘పెద్ది’. రామ్ చరణ్ ప్రధాన పాత్రలో బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. థియేటర్ల వద్ద సందడి కనిపించి చాలా రోజులవుతోందే అని సినీ ప్రేమికులు అనుకుంటున్న వేళ ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. జూన్ 4న ఈ సినిమా విడుదల కాబోతోంది. కాగా, ఈ నెల 18న ట్రైలర్ రానున్నట్లు ఇప్పటికే మూవీ టీమ్ ప్రకటించింది. కాగా, ఈ ట్రైలర్ ను చూసినట్లు మెగా స్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన ఆనందాన్ని ఆపుకోలేక చిరు లీక్స్ ఇచ్చి చాలా రోజులైందని పేర్కొంటూ తన స్పందనను తెలియజేశారు. పెద్ది ట్రైలర్ చూసాను!! జస్ట్ వావ్. 3 నిమిషాలు…PURE FIREPOWER PACKED TRAILER!! చరణ్… బుచ్చి… రెహమాన్…ఒక్కొక్కరు తమ బెస్ట్ ఇచ్చారు… కలిసి మాత్రం రఫ్ఫాడించేశారు! ఎంత ఊహించుకున్నా… దాన్ని మించి ఉంటుంది ఈ ట్రైలర్.ఎమోషన్..ఎలివేషన్..మ్యాడ్ నెస్ అన్నీ ఒక రేంజ్ లో ఉన్నాయి! అన్నట్టు… చాలా రోజులయ్యింది మీకు ‘చిరు లీక్స్’ ఇచ్చి అని సరదాగా పేర్కొన్నారు. మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు…నేను పోరాడాను సారు…”అంటూ ఈ మేరకు ఒక డైలాగ్ ను పంచుకున్నారు.  సారీ  బుచ్చి బాబు… చూసాక కంట్రోల్ తప్పా! అంటూ మెగాస్టార్ తనదైన శైలిలో పోస్ట్ చేశారు. మెగాస్టారే ట్రైలర్ చూసి తన ఉత్సాహాన్ని ఆపుకోలేకపోయారంటే ఇక సాధారణ ఫ్యాన్స్ పని ఏంటో అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ సారి బాక్సాఫీస్ వద్ద రామ్ చరణ్ మరో భారీ హిట్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *