థాయిలాండ్ ఓపెన్ ఫైనల్ చేరిన సాత్విక్-చిరాగ్ జోడీ

Spread the love

థాయిలాండ్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్-500 టోర్నీలో భారత స్టార్ షట్లర్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ అప్రతిహతమైన జోరు కనబరుస్తోంది. తాజాగా వీరు సెమీస్ లో విజయం సాధించి ఫైనల్ చేరారు. ఇక ఈ సీజన్లో లో ఇదే మొదటి  ఫైనల్ కావడం గమనార్హం. మలేషియా ద్వయం గో జెఫీ- నూర్ ఇజ్జుద్దీన్ పై భారత జోడీ సూపర్ విక్టరీ కొట్టింది. మొదటి సెట్ లో మలేషియా ఆటగాళ్లు గో జెఫీ- నూర్ ఇజ్జుద్దీన్ 21-19 తేడాతో గెలిచారు.  అనంతరం అద్భుతంగా పుంజుకున్న భారత జోడీ రెండో సెట్ ను  22-20తో గెలిచి మ్యాచ్ లో కీలక మైన నిర్ణయాత్మక  మూడో సెట్లో విజయం కోసం రెండు వైపులా తీవ్రంగా కృషి చేశారు. అయితే, భారత జోడీ అదిరే ఆటతీరుతో సత్తా చాటింది. నిర్ణయాత్మక సెట్ లో అత్యుత్తమ ఆటతీరు కనబరిచి 21-16తో గెలిచింది. దీంతో  ఈ మ్యాచ్ ను కైవసం చేసుకుంది. ఇటీవలే సాత్విక్-చిరాగ్ జోడీ థామస్ కప్ లో మెడల్ సాధించిన సంగతి తెలిసిందే. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *