ఉగ్రలింకుల కేసుతో ఇటీవల విజయవాడ వార్తల్లో నిలిచిన విషయం విదితమే. ఇటీవల విజయవాడ పాతబస్తీలో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేసి అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్న యువకులను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వారిని కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ కేసులో మొత్తం 12 మందిని నిందితులుగా చేర్చిన పోలీసులు ఇప్పటివరకు విజయవాడలో ముగ్గురిని, హైదరాబాద్, బీహార్ లలో ఒక్కొక్కరిని అరెస్ట్ చేశారు. తాజాగా మరో ముగ్గురు అరెస్ట్ అయ్యారు. మిగిలిన నిందితుల కోసం స్పెషల్ టీమ్స్ గాలిస్తున్నాయి.