మీడియాపై ఎదురుదాడి…ఐ-బొమ్మ నాది అని మీకెవరు చెప్పారు.. ?

Spread the love

పైరసీ వెబ్‌సైట్ ,బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ ఆరోపణలతో అరెస్టయిన రవి ఇమ్మడి  వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది.పోలీస్ కస్టడీ ముగిసిన అనంతరం ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షల కోసం తీసుకువెళ్తుండగా, రవి మీడియా ప్రతినిధులపై తీవ్రస్థాయిలో ఎదురుదాడికి దిగారు.తన పేరు “ఐ-బొమ్మ రవి” కాదని, అసలు ఆ వెబ్‌సైట్‌తో తనకు సంబంధం ఉందని ఎవరు చెప్పారని మీడియాను నిలదీశారు.తాను ఎక్కడికీ పారిపోలేదని, కూకట్‌పల్లిలోనే ఉన్నానని స్పష్టం చేస్తూనే..పోలీసులు చెబితే అది నిజమైపోదని, తాను కోర్టులోనే తేల్చుకుంటానని ఘాటుగా వ్యాఖ్యానించారు.మరోవైపు పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయని సమాచారం. రవి ఇతరుల ధ్రువపత్రాలను దొంగిలించి, ఫొటోలు మార్చి ప్రహ్లాద్, అంజయ్య వంటి వ్యక్తుల పేర్లతో పాన్ కార్డ్‌లు, బ్యాంకు ఖాతాలు సృష్టించి మోసాలకు పాల్పడినట్లు నిర్ధారణ అయింది.నిందితుడిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, కోర్టు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం అతడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తు ద్వారా వెబ్‌సైట్ మూలాలు కనిపెట్టే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.