ఫిడే ప్రపంచ ర్యాపిడ్ చెస్ లో బ్రాంజ్ మెడల్స్ తో భారత క్రీడాకారులు సత్తా చాటారు.
భారత గ్రాండ్ మాస్టర్ లు కోనేరు హంపి, అర్జున్ ఇరిగేశిలు పతకాలతో ఆకట్టుకున్నారు. ఇక ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వారిని అభినందించారు. ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ ర్యాపిడ్ విభాగంలో కాంస్య పతకం గెలిచిన కోనేరు హంపికి అభినందనలు. ఆట పట్ల ఆమె అంకితభావంఅద్భుతమని ఇక ముందు కూడా హంపి విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు ప్రధాని ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఇక ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఓపెన్ విభాగంలో కాంస్యం గెలిచిన అర్జున్ ను చూసి గర్విస్తున్నట్లు చెప్పారు. ఎంతో దృఢ సంకల్పంతో ఆడాడని భవిష్యత్తు ప్రయత్నాల్లో అతడు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారు.