బిపాసా బసు… ఒకప్పుడు బాలీవుడ్ లో అదరగొట్టిన ఈ హీరోయిన్ ఎక్కడ??? ఎం చేస్తుంది… అదేంటి, బాగా ఫేమస్ కదా… సినిమాలకి ఎందుకు దూరం అయ్యింది… ఆమ్మో ఇన్ని ప్రశ్నలా ఆ… ఆగండి అన్నిటికి సమాధానం చెప్తాం…
2001లో తెరపై అడుగుపెట్టిన ఈ భామ, తన గ్లామర్‌తో తో బాలీవుడ్ లో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతానికి సినిమాల్లో కనిపించకపోయినా ఆమె సంపాదన ఏ స్థాయిలో ఉందో తెలుసుకుంటే నిజంగా షాక్ అవుతారు తెలుసా???
2000s లో కుర్రకారును తన గ్లామర్‌తో ఉర్రూతలూగించిన బిపాసా, గత పదేళ్లుగా సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. చివరిసారిగా 2015లో వచ్చిన ‘అలోన్’ సినిమాలో కనిపించిన ఆమె, ఆ తర్వాత మళ్ళీ కెమెరా ముందు నటించలేదు. అయినప్పటికీ ఆమె పేరు మాత్రం ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంది. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. సినిమాలు చేయకపోతే ఇంత లగ్జరీ లైఫ్ ఎలా? అనే ప్రశ్న చాలామందికి సహజంగా వస్తుంది. కానీ బిపాసా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న సామెత బాగా ఫాలో అయ్యి, ట్రేండింగ్ లో ఉన్న టైం లోనే తన పేరునే ఒక బలమైన బ్రాండ్‌గా మార్చుకుంది.
ఆమె ఆదాయంలో ప్రధాన భాగం బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల నుంచే వస్తోంది. ఒక్కో కమర్షియల్ యాడ్ కి సుమారు రూ. 2 కోట్ల వరకు ఛార్జ్ చేస్తారనే సమాచారం ఉంది. సినిమాలు లేకపోయినా, ఆమె మార్కెట్ వాల్యూ ఏమాత్రం తగ్గలేదంటే అదే ఆమె సక్సెస్. సోర్సెస్ ప్రకారం బిపాసా ఆస్తి వేల్యూ దాదాపు రూ. 130 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ముంబైలో రూ. 16 కోట్ల విలువైన అద్భుతమైన లగ్జరీ ఇల్లు, కోల్‌కతాలో భారీ భవంతులు… ఇవన్నీ ఉన్నాయ్ కాబట్టే, హ్యాపీ గా లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తుంది.
ఇన్వెస్ట్‌మెంట్లతో పాటు, సోషల్ మీడియా పోస్టులు, రియాలిటీ షోలలో గెస్ట్ అప్పీరెన్సులు, ప్రైవేట్ ఈవెంట్లు, పాడ్‌కాస్ట్‌ల ద్వారా ఆమె నెలకు లక్షల్లో ఆదాయం పొందుతున్నారు.
ఇక ఆమె కార్స్ కలెక్షన్స్ చుస్తే మతి పోవాల్సిందే… ఆడి క్యూ7, పోర్షే కేయెన్, టయోటా ఫార్చ్యూనర్, వోక్స్‌వ్యాగన్ బీటిల్ వంటి ఖరీదైన లగ్జరీ కార్లు ఆమె గ్యారేజీలో ఉన్నాయ్.
ఇక బిపాసా వ్యక్తిగత జీవితానికి వస్తే… ప్రస్తుతం తన భర్త కరణ్ సింగ్ గ్రోవర్ ఇంకా కుమార్తె దేవితో కలిసి సంతోషమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు చూస్తే, సినిమాల కంటే కుటుంబానికే ఆమె ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. సో, ఇలా బిపాషా సినిమాలకి దూరం అయ్యి దాదాపు ఐదేళ్లు గడుస్తున్నా… హ్యాపీ గా లగ్జరీ లైఫ్ అనుభవిస్తుంది!