మొన్నే కదా మనం బాలయ్య అఖండ 2 టికెట్స్ బుక్ మై షో లో కనిపించక పోయే సరికి ఆశ్చర్యం వేసి, తీరా గంట గంట కి చూసి చూసి అలసి పోయి పడుకుని, తెల్లారి సినిమా పోస్టుపోన్ అయ్యింది అన్న వార్త తెలిసింది. సరేలే ఆ సినిమా అయిపోయింది అనుకున్నాం…కానీ నిన్న ప్రభాస్ రాజా సాబ్ టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకుంటే అలానే అయ్యింది… ఆమ్మో ప్రభాస్ సినిమా కూడా ఇలానే అవుతుందా అన్న భయం పట్టుకుంది… కానీ తెలంగాణ గవర్నమెంట్ సినిమా టికెట్ రేట్స్ ఇష్యూ మీద లేట్ గా GO ఇచ్చేసరికి అద్ద రాత్రి బుక్ మై షో లో టికెట్స్ రిలీజ్ చేసారు. పోనిలే సినిమా ఆల్రెడీ థియేటర్స్ లో రన్ అవుతుంది ఇంకా పాజిటివ్ టాక్ కూడా వచ్చేసింది… ఇంకేం కావాలి డార్లింగ్ సినిమా అదిరిపోయింది అంటున్నారు జనాలు!
ఇక స్టోరీ విషయానికి వస్తే, ప్రభాస్, ప్రభాస్ కి ఒక ముసలి బామ్మ … హ్యాపీ గా జీవితం గడుపుతుంటే, ముసలి దానికి ఎంత మతిమరపు ఉన్న వాళ్ళ అయన ని మర్చిపోదు. ఇక సంజయ్ దత్ ఏ ఆ ముసలి తాత. అలా ఆ తాత మహల్ లోకి మావాడిని రప్పించుకుని చేసే హుంగామ రాజా సాబ్… కానీ ట్రైలర్ లో కనిపించిన సీన్స్ కొన్ని సినిమాలో లో లేవు! పైగా సినిమాకి సీక్వెల్ కూడా అనౌన్స్ చేసి ముగించారు…ప్రభాస్ ని ఇలా కామెడీ చేస్తూ చూసి, బుజ్జిగాడు సినిమా గుర్తు చేసుకున్నారు ఫాన్స్… సో, మీరు కూడా సినిమా చూసేయండి! ఎలాగో వీకెండ్ కాబట్టి, కొంచం ఫన్ కోసం థియేటర్స్ కి వెళ్లిపోండి!