ఫాక్ట్ చెక్: ఆ వార్తల్లో నిజం లేదు…శ్రీలీల తల్లి క్లారిటీ 

Spread the love

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత వేగంగా స్టార్‌డమ్ సొంతం చేసుకుని దూసుకెళ్తున్నారు నటి శ్రీలీల. అనతి కాలంలోనే తన అందం, డ్యాన్స్, ఎనర్జీ, నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ఈ యువ నటి ప్రస్తుతం తెలుగులో అగ్రకథానాయికగా రాణిస్తోంది. ముఖ్యంగా యువ ప్రేక్షకుల్లో ఆమెకు విపరీతమైన క్రేజ్ ఉంది. తెలుగు ప్రేక్షకులు ఆమెను ఎంతో ఆదరించారు. వరుస సినిమాల్లో అవకాశాలు రావడంతో చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. ఇప్పుడు ఆమె కేవలం తెలుగు సినిమాలకే పరిమితం కావడం లేదు. ఈ ఏడాది తమిళ సినీ పరిశ్రమలోకి కూడా అడుగుపెడుతోంది. ఈ చిత్రంలో ధనుష్ తో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా గురించి తమిళ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. అయితే సినిమాల కంటే ఎక్కువగా గత కొంతకాలంగా శ్రీలీల వ్యక్తిగత జీవితం గురించి సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆమె డేటింగ్ రూమర్స్  వైరల్ అవుతూనే ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీలో స్టార్‌డమ్ పెరిగిన కొద్దీ ఇలాంటి పుకార్లు రావడం సాధారణమే అయినప్పటికీ శ్రీలీల విషయంలో మాత్రం సోషల్ మీడియాలో కథనాలు మరింత ఎక్కువయ్యాయి.

టీమిండియా యువ క్రికెటర్ తిలక్ వర్మతో ఆమె రిలేషన్‌లో ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఇద్దరూ తెలుగు రాష్ట్రాలకు చెందినవారే కావడంతో ఈ వార్తలు మరింత వేగంగా వైరల్ అవుతున్నాయి. గతేడాది నుంచే వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.అయితే ఇప్పటివరకు శ్రీలీల లేదా తిలక్ వర్మ ఈ వార్తలపై ప్రత్యక్షంగా స్పందించలేదు. దీంతో సోషల్ మీడియాలో ఊహాగానాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కానీ తాజాగా ఈ వార్తలపై శ్రీలీల తల్లి స్వర్ణలత క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టంగా చెప్పారు. ఇవి పూర్తిగా నిరాధారమైన కథనాలు. ఇలాంటి వార్తలు ఎలా పుడుతున్నాయో కూడా అర్థం కావడం లేదని ఆమె అన్నారు. ప్రస్తుతం శ్రీలీల పూర్తిగా తన కెరీర్, చదువులపైనే దృష్టి పెట్టిందట. సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ… ఆమె ఇంకా మెడికల్ చదువులు కొనసాగిస్తోందని తెలిపారు. ప్రస్తుతం శ్రీలీల తన కెరీర్‌పై పూర్తి ఫోకస్ పెట్టింది. వరుస సినిమాలు, పాన్ ఇండియా అవకాశాలు, చదువు తో బిజీ గా ఉంది. మరోవైపు అభిమానులు మాత్రం ఆమె నుంచి మరిన్ని మంచి సినిమాలు రావాలని ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన శ్రీలీల… భవిష్యత్తులో ఇంకా పెద్ద స్థాయికి వెళ్లే అవకాశాలు ఉన్నాయని ఆకాంక్షిస్తున్నారు. గతంలో కూడా శ్రీలీలపై ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు ఆమె తల్లి స్వర్ణలత ఖండించారు. హిందీ  నటుడు కార్తిక్ ఆర్యన్ తో  ఆమె రిలేషన్ లో ఉన్నట్లు వచ్చిన పుకార్లను ఖండించారు. కార్తిక్ ఆర్యన్ తల్లి, తానూ ఇద్దరూ కూడా గైనకాలజిస్టులమని ఆమె పేర్కొన్నారు.  వాళ్ల వృత్తి  నేపథ్యం కారణంగా కలుసుకుంటామని అయితే  దురదృష్టవశాత్తూ కొందరు  మరో విధంగా రాయడం రాయడం మొదలుపెట్టారని ఖండించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *