Global Star Ram Charan watch cost?

Global Star Ram Charan watch cost

సెలబ్రిటీలు ఏం చేసినా అది వార్తే అవుతుంది. ఏది తిన్నా, ఎటు వెళ్లినా, ఏం ధరించినా అది సెన్సెషనల్‌ టాపిక్‌గా మారుతుంది. తల నుంచి కాళ్ల వరకు ఏదీ వదలకుండా ఏం ధరించారని జల్లెడ పట్టి మరీ చూస్తుంటారు ఫ్యాన్స్ . తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. నిన్నే డల్లాస్ లో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ లో స్టైలిష్ లుక్ లో కనిపించి అదరగొట్టాడు. ఆ ఈవెంట్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. అందులో ముఖ్యంగా చరణ్ తన చేతికి పెట్టుకున్న వాచ్ హైలెట్ అవుతోంది. చరణ్ ధరించిన వాచ్ పేరు, దాని ఖరీదు చూసిన అందరూ షాక్ అవుతున్నారు. ఎందుకంటే చరణ్ ధరించిన వాచ్ ధర అక్షరాలా 3 కోట్లట. అయ్యబాబోయ్ అన్ని కోట్లా అని ఆశ్చర్యపోతున్నారా..అవును అక్షరాలా 3 కోట్లు ఎందుకంటే ఇది ప్రముఖ స్విస్ మేడ్ కంపెనీ జాకబ్ అండ్ కో గ్రాండ్ కాంప్లికేషన్ బ్రాండ్ కి చెందిన వాచ్. మరి స్టార్స్‌ అన్నప్పుడు ఆమాత్రం ఉండాలంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.