
China Russia Silicon Valley: పెళ్లంటే నచ్చి చేసుకునే వేడుక. పిల్లలు అంటే మోయాలనిపించే బరువు.. అందువల్లే మన దేశంలో వివాహ వ్యవస్థ ఇంత బలంగా ఉంది. బయట ప్రపంచంలో వివాహ వ్యవస్థ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నప్పటికీ.. మనదేశంలో కూడా విడాకులు పెరిగిపోతున్నప్పటికీ.. ఇప్పటికీ కూడా వివాహ వ్యవస్థ బలంగానే ఉంది. దీనికి కారణం మన సమాజం లో విలువలు ఉండడమే. అయితే ఇప్పుడు ఈ వివాహన్నే కొన్ని దేశాలు సీక్రెట్ ఆపరేషన్ కోసం ఉపయోగించుకుంటున్నాయి.
అమెరికా సాంకేతిక రంగానికి గుండెకాయలాంటి “సిలికాన్ వ్యాలీ”లో కలకలం రేగుతోంది. “సెక్స్ వార్‌ఫేర్” అనే కొత్త తరహా గూఢచర్యం భయానక వాతావరణాన్ని సృష్టించింది. ప్రపంచ టెక్ ఆధిపత్యాన్ని సవాల్ చేయాలనే లక్ష్యంతో చైనా, రష్యా వంటి దేశాలు అందమైన యువతులను గూఢచారిణులుగా ఉపయోగిస్తూ అమెరికా కంపెనీల రహస్యాలను దోచుకునేందుకు యత్నించడం సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది.
ఎట్ ప్రెజెంట్ డేస్ లో శత్రువుల రహస్యాలు తెలుసుకోవాలంటే కొన్ని దేశాలు ఎన్నో విచిత్రమైన ట్రిక్స్ ను ప్లే చేస్తున్నారు. శత్రుదేశాలలో పనిచేసే యుద్ధ రంగ నిపుణుల దగ్గర నుంచి రహస్యాలు సేకరించడానికి వలపు వలలు ప్రయోగించేవారు. అందమైన మహిళలను ఎరగా వేసి.. వారి ద్వారా రహస్యాలను తెలుసుకునేవారు. ప్రత్యర్థుల సీక్రేట్స్ తెలుసుకోవడానికి కాలంతోపాటు అనేక కొత్త కొత్త విధానాలను అమలు చేస్తున్నారు. అమ్మాయిలకు లొంగని వారిని డబ్బులు చూపించి తమ దారిలోకి తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఈ విధానాలు కూడా పాతదిగా మారిపోయాయి వారికి. ఎందుకంటే సాంకేతికతకు కొత్త అర్థం చెప్పే సిలికాన్ వ్యాలీ ప్రాంతంలో ఒక కొత్త విధానం అందుబాటులోకి వచ్చింది. ఈ విధానానికి “సె* వార్ ఫేర్” అనే పేరు పెట్టారు. ఇది అక్కడి కంపెనీల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. వివిధ సంస్థల రహస్యాలను తెలుసుకోవడానికి చైనా, రష్యా వంటి దేశాలు దీనికి తెరలేపినట్టు తెలుస్తోంది.
వలపు వలలో ముందుగా అందమైన అమ్మాయిలు తమ అందచందాలను ఎరగా వేస్తుంటారు. ఆ తర్వాత సీక్రేట్స్ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. కొందరైతే రహస్యాలతో పాటు డబ్బులు కూడా డిమాండ్ చేస్తుంటారు. ఆ తర్వాత వారు కనిపించకుండా పోతారు. అందమైన అమ్మాయిలు టార్గెట్ ప్రజలతో కలిసి ఉన్నప్పుడు వాటిని వీడియో తీస్తారు. ఆ వీడియోలను బయటపెడతామని బెదిరించి డబ్బులు లేదా రహస్యాలను చెప్పాలని డిమాండ్ చేస్తారు.
అయితే ఇతర ఆపరేషన్లు చేయడంలో చైనా, రష్యన్ ఆపరేటర్లు సిద్ధహస్తులు. అయితే ఇప్పుడు వలపువలలో సరికొత్త విధానాన్ని ఈ రెండు దేశాల ఆపరేటర్లు అనుసరిస్తున్నారు. వలపు వల విసరడం మాత్రమే కాదు.. ఆ మహిళలతో ఆ వ్యక్తులకు పెళ్ళి కూడా చేస్తున్నారు.. పిల్లలను కనేలా ప్రోత్సహిస్తున్నారు. ఏమాత్రం అనుమానం రాకుండా రహస్యాలు తెలుసుకుంటున్నారు. ఆ తర్వాత పిల్లల్ని వదిలేసి విడాకులు తీసుకునే విధంగా ప్రోత్సహిస్తున్నారు.
ఈ గూఢచారిణులు టెక్ కంపెనీల సీనియర్ ఇంజనీర్లు, మేనేజర్లు, పరిశోధకులతో సన్నిహిత సంబంధాలు పెంచుకుని, వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం ప్రారంభిస్తారు. కొంతమంది వారిని వివాహం చేసుకోవడం ద్వారా కుటుంబ స్థాయిలో సంబంధాలు పెంచుకుని.. దశాబ్దాలపాటు కంపెనీ రహస్యాలపై నియంత్రణ సాధిస్తారు. నిఘా నిపుణుల ప్రకారం ఇది గతంలో ప్రాచుర్యంలో ఉన్న “హనీట్రాప్” విధానానికి ఆధునిక రూపంగా అభివర్ణిస్తున్నారు. ఇప్పుడు ఈ పద్ధతి సాంకేతిక రంగానికి పెద్ద ముప్పుగా మారింది. చైనా, రష్యా గూఢచార సంస్థలు ఈ వ్యూహాన్ని క్రమబద్ధంగా అమలు చేస్తున్నట్లు అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా చైనాకు చెందిన యువతులు అంతర్జాతీయ బిజినెస్ కాన్ఫరెన్సులు వేదికగా టెక్ ప్రొఫెషనల్స్‌ను లక్ష్యంగా చేసుకుంటున్నారు.
ఇక గూఢచర్యం ఇప్పుడు కేవలం వ్యక్తిగత స్థాయిలోనే కాకుండా, స్టార్టప్‌ల రూపంలో కూడా జరుగుతోంది. అమెరికా స్టార్టప్‌లను ఆకర్షించేందుకు చైనా పెట్టుబడిదారులు, టెక్ సమ్మిట్‌లు, పోటీలు నిర్వహిస్తూ, వాటి వ్యాపార మోడల్స్, సాంకేతిక ఆవిష్కరణలను సమగ్రంగా సేకరిస్తున్నారు. ఇంటెలిజెన్స్ నిపుణుల ప్రకారం, చైనా ప్రభుత్వం మద్దతుతో నడుస్తున్న కొన్ని ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీలు ఇన్నోవేషన్ ఎక్స్ చేంజ్ పేరిట టెక్ కంపెనీల డేటా, AI ఆల్గారిథమ్స్, చిప్ డిజైన్ లు దోచుకుంటున్నట్లు కనిపెట్టారు.
అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ కౌన్సిల్ అంచనా ప్రకారం.. ప్రతి సంవత్సరం సుమారు 600 బిలియన్ల విలువైన మేధో సంపత్తి దొంగతనం జరుగుతోంది. ఇందులో అధిక భాగం చైనా మూలంగా జరుగుతోందని నివేదికలు చెబుతున్నాయి. ఇది కేవలం టెక్ కంపెనీలకు మాత్రమే కాకుండా, దేశ భద్రతకు కూడా తీవ్రమైన ముప్పుగా మారుతోంది. సిలికాన్ వ్యాలీలోని ప్రధాన లక్ష్యాలు కృత్రిమ మేధస్సు (AI), క్వాంటం కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, రక్షణ టెక్నాలజీలకు సంబంధించిన కంపెనీలు. ఈ రంగాల్లో అమెరికా ఆధిపత్యాన్ని దెబ్బతీయడం కోసం చైనా ప్రభుత్వం అనధికారికంగా “సాంకేతిక గూఢచర్య బృందాలను” ఏర్పాటు చేసిందని ఇంటెలిజెన్స్ రిపోర్టులు సూచిస్తున్నాయి.
అయితే ఇందులో చైనా మాత్రమే కాకుండా దక్షిణ కొరియా, ఇజ్రాయిల్, ఇరాన్ వంటి దేశాలు కూడా అమెరికా టెక్ రంగంలో సైలెంట్ గా నిఘా కార్యక్రమాలు సాగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఇజ్రాయిల్ సైబర్ సెక్యూరిటీ స్టార్టప్‌ల ద్వారా అమెరికా డిఫెన్స్ సిస్టమ్స్‌పై పరోక్ష పర్యవేక్షణ చేస్తున్నట్లు అమెరికా అధికారులు తెలిపారు. ఇక ఇందులో భాగంగా FBI, CIA సంస్థలు టెక్ రంగం ఉద్యోగులకు కఠినమైన భద్రతా మార్గదర్శకాలను జారీ చేశాయి. అజ్ఞాత సోషల్ మీడియా కాంటాక్ట్స్‌ను తిరస్కరించడం, వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోకపోవడం, వ్యాపార ప్రాజెక్టుల వివరాలను రక్షించడం వంటి సూచనలు అందించారు. FBI ఇప్పటికే 200 కంటే ఎక్కువ “హనీట్రాప్ కేసులు”ను విచారిస్తున్నట్లు సమాచారం. China Russia Silicon Valley.
అమెరికన్ ఐటి నిపుణులను టార్గెట్ చేస్తూ చైనా, రష్యా ఇటువంటి విధానాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తుంది. చైనాలో పెట్టుబడి పెట్టే కంపెనీల అధిపతులు ఇటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలని పా మిల్ కన్సల్టింగ్ చీఫ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ జేమ్స్ మాల్వెనన్ హెచ్చరించారు. ఈ తరహా మోసాన్ని తాను ఇటీవల స్వయంగా చూసినట్టు ప్రకటించాడు. అందమైన అమ్మాయిలనుంచి సోషల్ మీడియాలో అభ్యర్థనలు పెరిగిపోవడమే ఎందుకు నిదర్శనం అని అతను చెప్పుకొచ్చారు.
అదే కాదు ఇటీవల కాలంలో వర్జీనియా ప్రాంతంలో ఓ వ్యాపార సమావేశం జరిగింది. ఆ సమావేశానికి అనుమతి లేకుండానే ఇద్దరు అందమైన చైనీస్ అమ్మాయిలు ప్రవేశించడానికి ప్రయత్నించారు. అయితే సెక్యూరిటీ సిబ్బంది ముందుగానే గుర్తించి వారిని వెనక్కి పంపించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన సమాచారం వారి దగ్గర ఉండడాన్ని వ్యాపారస్తులు నమ్మలేకపోతున్నారు. ఇటీవల కాలంలో ఓ సున్నితమైన ప్రాజెక్టులో అమెరికా దేశానికి చెందిన స్పేస్ ఇంజనీర్ కు భాగస్వామ్యం ఉంది. అయితే అతడి నుంచి రహస్యాలు తెలుసుకోవడానికి ఓ రష్యన్ మహిళ అందచందాలను ఎరవేసింది. ఆ తర్వాత అతన్ని పెళ్లి చేసుకుంది.. చివరికి అసలు విషయం తెలియడంతో ఆమెకు అమెరికా సైంటిస్ట్ విడాకులు ఇచ్చినట్లు తెలుస్తుంది.
ఇక ఇంతటి షాకింగ్ న్యూస్ తో గూగుల్, ఆపిల్, ఎన్‌విడియా, టెస్లా వంటి కంపెనీలు కూడా తమ అంతర్గత భద్రతా వ్యవస్థలను పునరాలోచిస్తున్నాయి. “సెక్స్ వార్‌ఫేర్” రూపంలో జరుగుతున్న ఈ గూఢచర్యం ఇప్పుడు అమెరికా టెక్ ప్రపంచానికి కొత్త యుద్ధం లాంటిదిగా మారింది.