
Operation Sindoor Heroes: దేశ రక్షణలో విశిష్ఠ సేవలు అందించడంతో పాటు అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన భారత సైనిక దళాల సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం శౌర్య పురస్కారాలను ప్రకటించింది. ఆపరేషన్ సిందూర్ సహా పలు కీలక ఆపరేషన్లలో పాల్గొన్న ఆర్మీ, వైమానిక దళాలకు చెందిన పలువురు అధికారులను ప్రతిష్ఠాత్మక వీర చక్ర పురస్కారంతో గౌరవించింది. ఈ మేరకు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను మట్టుపెట్టించడానికి ఇండియా చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్ సూపర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. శత్రుదేశం కళ్లు తెరిచేలోగా మన సైనికులు పని పూర్తి చేసుకుని వచ్చేశారు. ఇప్పుడు ఆపరేషన్ సిందూర్ సమయంలో ప్లాన్ పక్కాగా అమలు చేసిన రక్షణ దళాల అసాధారణ ధైర్యసాహసాలను భారత ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. శౌర్య పురస్కారాలను అందజేస్తున్నట్లు గెజిట్ నోటిఫికేషన్‌లో తెలిపింది. ఇండియా మోస్ట్ సక్సెస్‌ఫుల్ కౌంటర్- టెర్రరిజం మిషన్‌లో కరేజ్, లీడర్‌షిప్, ఎక్సెప్షనల్ సర్వీస్‌ని గుర్తించి ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కి చెందిన ఆరుగురు అధికారులకు ‘వీర్ చక్ర అవార్డులు ప్రకటించింది.
జమ్మూ కాశ్మీర్‌లో పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి ఇండియా ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. 26 మంది సామాన్యులను పాశవికంగా పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా 2025 మే 7న ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ మిషన్ తెల్లవారుజామున 1:05 గంటలకు ప్రారంభమై కేవలం 22 నిమిషాల్లో ముగిసింది. భారత దళాలు పాకిస్థాన్, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాయి. వీటిలో మురిద్కే, బహవల్పూర్‌లోని ప్రధాన కేంద్రాలు ఉన్నాయి. పహల్గామ్ దాడిలో పుసుపు కుంకాలు కోల్పోయిన ఆడబిడ్డలకు నివాళిగా ‘సిందూర్’ అనే పేరును ఎంచుకున్నారు.
ఇది మల్టీ డొమైన్, హై-ప్రెసిషన్ ఆపరేషన్. ఇండియన్ ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, ఇస్రో కలిసి పని చేశాయి. ఇండియా సొంత టెక్నాలజీ ప్రధాన పాత్ర పోషించింది. రఫెల్, Su-30MKI జెట్‌లు బ్రహ్మోస్ మిసైల్స్‌తో వెళ్లాయి. రియల్ టైమ్ సర్వీలియన్స్ అందించే డ్రోన్‌లు, లైవ్ ఇంటిలిజెన్స్ అందించే శాటిలైట్స్ కీలకంగా పని చేశాయి. తర్వాత పాకిస్థాన్ ప్రయోగించిన డ్రోన్లు, ఆర్టిలరీ, మిసైల్స్‌ని మన అడ్వాన్స్‌డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లు S-400, ఆకాశ్ సక్సెస్‌ఫుల్‌గా అడ్డుకున్నాయి. మొత్తంగా ఆరు పాకిస్థాన్ యుద్ధ విమానాలు, రెండు హై వ్యాల్యూ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, 10 UCAVలు, ఒక C-130 ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ ధ్వంసం చేశాయి. 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. భారీ నష్టాలను చవిచూసిన తర్వాత పాకిస్థాన్ కాల్పుల విరమణ కోరింది.
కల్నల్ కోశాంక్ లాంబా, 302 మీడియం రెజిమెంట్. కల్నల్ కోశాంక్ లాంబా తన నాయకత్వం, ధైర్యసాహసాలకు ఈ గౌరవం అందుకున్నారు. అతి తక్కువ సమయంలోనే ఆయన మొట్టమొదటిసారిగా స్పెషల్ ఎక్విప్‌మెంట్‌ని ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్‌లో పంపించారు. కీలకమైన రిసోర్సెస్ ఆపరేషన్ సైట్‌కు త్వరగా, సీక్రెట్‌గా చేరేలా చూశారు. మిషన్ సక్సెస్ అవ్వడంలో కీలక పాత్ర పోషించారు. లెఫ్టినెంట్ కల్నల్ సుశీల్ బిస్త్, 1988 మీడియం బ్యాటరీ. లెఫ్టినెంట్ కల్నల్ సుశీల్ బిస్త్ ఫియర్‌లెస్ లీడర్‌షిప్, స్మార్ట్ ప్లానింగ్‌కి అవార్డు అందుకున్నారు. తన యూనిట్‌ని ముందు ఉండి నడిపించారు. మల్టిపుల్ టెర్రరిస్ట్ క్యాంపులను ఈయన ధ్వంసం చేశారు. మిషన్ సక్సెస్‌లో కీలక పాత్ర పోషించారు.
గ్రూప్ కెప్టెన్ రంజీత్ సింగ్ సిద్ధూ, ఫ్లయింగ్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్: గ్రూప్ కెప్టెన్ రంజీత్ సింగ్ సిద్ధూ చూపిన ధైర్యం, ప్లాన్‌ని పక్కాగా అమలు చేసిన తీరుకు గౌరవం దక్కింది. ఫైటర్ జెట్ల స్క్వాడ్రన్‌కు నాయకత్వం వహించారు. శత్రువుల స్థావరాలపై అక్యురేట్ స్ట్రైక్స్ జరిపారు. అన్ని మిషన్ గోల్స్ పర్ఫెక్ట్‌గా రీచ్ అయ్యారు. ఇక ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఫ్లయింగ్ పైలట్ అయిన గ్రూప్ కెప్టెన్ అనిమేష్ పట్ని, సర్ఫేస్-టు-ఎయిర్ మిస్సైల్ స్క్వాడ్రన్‌ని లీడ్ చేశారు. తన అవుట్ స్టాండింగ్ లీడర్‌షిప్‌తో అవార్డు అందుకున్నారు. అతని నాయకత్వంలో టీమ్ శత్రు లక్ష్యాలను విజయవంతంగా ధ్వంసం చేసింది. మనకు ఎటువంటి నష్టాలు జరగకుండా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఫ్లయింగ్ పైలట్ అయిన స్క్వాడ్రన్ లీడర్ రిజ్వాన్ మాలిక్, శత్రు భూభాగంలో అర్ధరాత్రి చేపట్టిన దాడికి డిప్యూటీ మిషన్ లీడర్‌గా పనిచేశారు. ఎస్కార్ట్ లేకుండా ఫ్లై చేస్తూ, హెవీ ఎయిర్ డిఫెన్స్‌కి చిక్కకుండా, లో- లెవల్ ఫ్లైయింగ్, పక్కా టైమింగ్ ఫాలో అవుతూ టార్గెట్స్‌ని ధ్వంసం చేశారు. Operation Sindoor Heroes.
ఎయిర్ ఫోర్స్‌లో ఫ్లయింగ్ పైలట్ అయిన స్క్వాడ్రన్ లీడర్ సిద్ధాంత్ సింగ్, శత్రు భూభాగంలో త్రీ-ఎయిర్ క్రాఫ్ట్ ఫార్మేషన్‌కి నాయకత్వం వహించారు. లాంగ్ రేంజ్ మిసైల్స్, ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ డిఫెన్స్ ఉన్న ఏరియాలో తన కేర్‌ఫుల్ ప్లానింగ్, కోఆర్డినేషన్, ఫ్లైయింగ్ స్కిల్స్‌తో అదరగొట్టాడు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా టీమ్ టార్గెట్ ఫినిష్ చేసి సక్సెస్‌ఫుల్‌గా తిరిగి రావడంలో కీలక పాత్ర పోషించాడు.
మొత్తంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 127 గ్యాలంట్రీ అవార్డులు, 40 విశిష్ట సేవా పురస్కారాలకు ఆమోదం తెలిపారు. వీటిలో 4 కీర్తి చక్రలు, 15 వీర చక్రలు, 16 శౌర్య చక్రలు ఉన్నాయి. దేశ భద్రత పట్ల సైనిక దళాల అంకితభావం, నాయకత్వ పటిమ, కార్యాచరణ నైపుణ్యాలకు ఈ పురస్కారాలు నిదర్శనమని కేంద్రం గెజిట్ నోటిఫికేషన్‌లో పొందుపరిచారు. దేశ రక్షణలో విశిష్ఠ సేవలు అందించన ఈ రియల్ హీరోస్ కి మన తరపునుంచి కూడా ఒక సెల్యూట్.