భారత్-యూరోపియన్ యూనియన్ డీల్ తో భారత్ కే లాభం

Spread the love

భారత్-యూరోపియన్ యూనియన్ ల మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరిన విషయం తెలిసిందే. కాగా, దీనిపై అమెరికా వాణిజ్య ప్రతినిధి జెమిసర్ గ్రీర్  మాట్లాడుతూ ఈ డీల్ తో భారత్ కే అధిక ప్రయోజనమనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ అగ్రిమెంట్ కు సంబంధించి కొన్ని వివరాలు నేను పరిశీలించాను. ఇందులో భారత్ దే పైచేయిగా నిలుస్తుందని భావిస్తున్నా అని అన్నారు. యూరోపియన్ మార్కెట్ లో భారత ప్రొడక్ట్స్ కు ఎక్కువ అవకాశాలున్నాయని పేర్కొన్నారు. అలాగే భారతీయ నిపుణులకు యూరప్ లో ఎక్కువ అవకాశాలు లభిస్తాయని అన్నారు. ఈ సందర్భంగా అమెరికా టారిఫ్ ల ప్రభావంతో వివిధ  దేశాలు వేరే మార్కెట్ల వైపు  చూస్తున్నట్లు పేర్కొన్నారు. అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ దేశీయ ఉత్పత్తులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఇక భారత్-యూరప్ ల మధ్య కుదిరిన డీల్ పై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దీనిని ‘మథర్ ఆఫ్ ఆల్ డీల్స్’ గా అభివర్ణిస్తున్నారు. ఇది ఇరువైపులా గేమ్ ఛేంజెర్ గా మారే అవకాశం ఉన్నట్లు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.