అమెరికా చెప్పే ప్రతి దానికి భారత్ అంగీకరించదు:అమెరికా రిటైర్డ్ కల్నల్ కీలక వ్యాఖ్యలు

Spread the love

గత కొద్దికాలంగా భారత్-అమెరికా దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య సంబంధాల గురించి తెలిసిందే. భారత్ పై టారిఫ్ ల విధింపు తదనంతర పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. ఇక ఇరు దేశాల మధ్య  వాణిజ్య చర్చలు కూడా జరుగుతున్నాయి. ఈ చర్చలపై అమెరికా రిటైర్డ్ కల్నల్, డిఫెన్స్ సెక్టార్ ఎక్స్పర్ట్ మక్ గ్రెగర్  కీలక వ్యాఖ్యలు చేశారు. వాణిజ్య ఒప్పందాల కోసం అమెరికా చెప్పిన ప్రతిదానికి భారత్ తలవంచదని పేర్కొన్నారు. మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈమేరకు వ్యాఖ్యానించారు. రష్యాతో బిజినెస్ చేస్తుందన్న అంశంపై భారత్ పై ఒత్తిడి పెంచేందుకు భారత్ పై 50 శాతం టారిఫ్ విధించడం ట్రంప్ మనస్తత్వాన్ని తెలియజేస్తుందని అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా భారత్-రష్యాలు మిత్ర దేశాలుగా ఉన్నాయని ఇప్పుడు వాటిని వ్యాపారం చేయవద్దంటే ఆ రెండు దేశాలు అమెరికాను వ్యతిరేకించే అవకాశం ఉందన్నారు. గ్రీన్ ల్యాండ్ అంశం యూరోపియన్ దేశాల టారిఫ్ ల వంటి పైనా ఆయన ప్రస్తావించారు. ప్రపంచ దేశాలపై బెదిరింపులకు దిగుతూ టారిఫ్ లు విడిస్తే ఇది అమెరికాకే నష్టమనే అభిప్రాయం వ్యక్తం చేశారు.