
Israel and Hamas War: అమెరికా అధ్యక్షుడు అనుకున్నది సాధించాడు. ఇజ్రాయోల్ – హామాస్ లను శాంతి ఒప్పందానికి ఒప్పించారు. రెండు దేశాలు శాంతి ఒప్పందంపై సంతకాలు చేశాయని అధికారికంగా ధృవీకరించాయి. ఈ ఒప్పందంలో రెండేళ్ల పాటు విరామం లేకుండా జరిగిన యద్ధం ముగిసింది. గాజా నగరం పునర్మిణంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారింది.
ఇజ్రాయోల్ – హామాస్ ల మధ్య శాంతి కైమాక్స్ లో ఉంది. శాంతి ఒప్పందం పూర్తైంది. ఇరు దేశాల మధ్య రెండేళ్ల పాటు జరిగిన యుద్ధంలో వేలాది మంది నిరాశ్రయులు అయ్యారు. వేల భవనాలు కూలిపోయాయి. గాజాలో ఎటు చూసిన శిథిల భవనాలే దర్శనమిస్తున్నాయి. కనుచూపిమేరలో మనుషులు కనిపించడంలేదు. రెండేళ్లకు పైగా జరిగిన వార్ లో గాజా వాసులకు తీవ్ర నష్టం జరిగింది. ట్రంప్ ఒత్తిడితో.. ఇజ్రాయోల్ – హామాస్ తొలి దశ శాంతి ఒప్పందానికి అంగీకరించాయి. ఈ మేరకు సంతకాలు చేసినట్లు ట్రంప్ ట్రూత్ లో పోస్ట్ చేశారు. మరో వైపు ఇజ్రాయోల్ – హామాస్ లు కూడా శాంతి ఒప్పందాన్ని ధృవీకరించాయి. గాజా మొదటి దశ శాంతి ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. రెండు దేశాలు శాంతికి అంగీకరించడంపై గౌరవంగా ఉందని ట్రంప్ అన్నారు. ఇది ఒక చారిత్రక అడుగని.. ఈ విరామం బందీలు, ఖైదీల విడుదలకు మార్గం సుగుమం అని.. ట్రంప్ అభిప్రాయపడ్డారు.
బందీలందరు త్వరలోనే విడుదలవుతారని అన్న ఆయన.. ఒప్పందం ప్రకారం ఇజ్రాయోల్ తన సైన్యాన్ని ఉపసంహరించుకుంటుందని వెల్లడించారు. దీర్ఘకాలికమైన శాంతిని సాధించే క్రమంలో.. సైనికులు ఉపసంహరణ తొలి అడుగుగా నిలిచిపోతుందన్నారు. అన్ని పార్టీలను సమంగా చూస్తామని.. అరబ్ – ముస్లిం ప్రపంచం.. ఇజ్రాయోల్ ఇతర చుట్టుపక్కల దేశాలకు ఇది గొప్ప రోజు అని అన్నారు. అలాగే తమతో కలిసి పనిచేసిన మధ్యవర్తులు ఖతార్, ఈజిప్ట్, తుర్కియో కు ధన్యవాదాలు తెలిపారు ట్రంప్. అటు ఒప్పందాన్ని ధృవీకరించిన ఇజ్రాయోల్ ప్రధాని కూడా ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇది ఇజ్రాయోల్ కు దౌత్య పరమైన విజయమన్నారు. బందీలందరిని తిరిగి తీసుకురావడం, అలాగే తమ లక్ష్యాలను సాధించేవరకు విశ్రాంతి తీసుకునేది లేదని స్పష్టం చేశారు. తన మిత్రులు ట్రంప్ గొప్ప ప్రయత్నాలతో కీలక దశకు చేరుకున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు.
హామాస్ కూడా శాంతి ఒప్పందాన్ని ధృవీకరించింది. గాజాలో యుద్ధానికి ముగింపు పలికేందుకు ఈ ఒప్పందంలో దోహదం చేస్తుందని తెలిపింది. ఇజ్రాయోల్ బలగాలు గాజాను వీడతాయని విశ్వాసం వ్యక్తం చేసిన హామాస్ గాజాలోకి అంతర్జాతీయ సాయం వచ్చేందుకు అవకాశం ఏర్పడిందని.. వెల్లడించింది. పాలస్తీనా యుద్ధ ఖైదీల విడుదలకు ఈ ఒప్పందం దోహదపడుతుందని చెప్పింది. ఈ ఒప్పందం కీలక పాత్ర పోషించిన ఖతార్, ఈజిప్ట్, తుర్కియో, ట్రంప్ కు కృతజ్ఞతలు తెలిపింది. ఈ వారంతరంలో 2 0 మంది బందీలను విడుదల చేయ్యాలని హామాస్ యోచిస్తుంది. గాజాలోని మెజార్టీ ప్రాంతం నుంచి ఇజ్రాయోల్ బలగాలు వైదొలిగే అవకాశం ఉందని భావిస్తోంది. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయోల్ పై హామాస్ దాడిలో 12వందల మందికి పైగా ప్రాణాలు కొల్పోయారు. 251 మందిని ఆ సంస్థ బందించి.. గాజాకు తీసుకెళ్లింది. ఆ తర్వాత గాజాపై ఇజ్రాయోల్ భీకరంగా విరుచుకుపడింది. హామాస్ ఉగ్రవాదులను మట్టుపెట్టడమే లక్ష్యంగా మూకుమ్మడి దాడులు చేసింది.
దాదాపు రెండేళ్ల నుంచి జరుగుతున్న ఈ యుద్ధంలో ఇప్పటి వరకు 67 వేల 127 మంది పాలస్తీనా వాసులు మరణించారు. లక్ష 69వేల 841 మంది గాయపడ్డారు. లక్షపైగా భవనాలు నెలమట్టమయ్యాయి. మధ్య తాత్కాలికంగా జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంతో.. కొందరు బందీలు విడుదలవ్వగా.. ఇంకా 97 మంది హామాస్ చెరలోనే ఉన్నారు. అయితే పలు ఘటనల్లో మరికొందరు మృతి చెందారు. సుదీర్ఘకాలంగా యుద్ధం జరుగుతుండడంతో.. వేలాది మంది ప్రాణాలు కొల్పోయారు. దీంతో యుద్ధానికి ముగింపు పలికేందుకు ట్రంప్ ముందుకు వచ్చారు. ట్రంప్ వార్నింగ్ తో ఇజ్రాయోల్ – హామాస్ దారిలోకి వచ్చాయి. గాజా శాంతి ఒప్పందం కోసం 20 సూత్రాల ప్రణాళిక ను హామాస్ ముందుంచారు. ఈ ప్రణాళికకు ఒప్పుకోకపోతే.. నరకం చూపిస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలో గాజా యుద్ధాన్ని ముగించాడానికి ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళిక తొలిదశ అమలుపై మూడు రోజులుగా హామాస్ – ఇజ్రాయోల్ మధ్య పరోక్ష చర్చలు జరుగుతున్నాయి. తాజాగా తొలి దశ ఒప్పందానికి ఇరుదేశాలు అంగీకరించాయి. Israel and Hamas War.
అయితే హామాస్ నిరాదీయికరణ, గాజా భవిష్యత్తు పాలన వంటి వాటిపై స్పష్టత రాలేదు. ఈ ఒప్పందానికి ముందు డొనాల్డ్ ట్రంప్ గాజా యుద్ధం ముగింపు వ్యవహారంలో హామాస్ పై తీవ్ర ఒత్తడి చేశారు. శాంతి ఒప్పందం విషయంలో వేగంగా నిర్ణయం తీసుకోవాలని లేదంటే.. గడ్డు పరిస్థితులను ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించారు. హామాస్ కు డెడ్ లైన్ పెట్టారు. ఈ క్రమంలోనే హమాస్ అంగీకరించింది. శాంతి ఒప్పందంపై సంతకం చేసింది. గాజాలో ఇజ్రాయోల్ యుద్దాన్ని నిరసిస్తూ.. స్పెయిన్, ఇటలీ, పోర్చుగల్ లో భారీ ప్రదర్శనలు జరిగాయి. ఈ ర్యాలీలో భారీగా ప్రజలు పాల్గొన్నారు. ఇజ్రాయోల్ బందీలను విడుదల చేసేందుకు హామాస్ అంగీకరించడం, గొప్ప పురోగతి అని భారత్ ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు. శాంతి కోసం చేసే ప్రతి ప్రయత్నానికి భారత్ మద్దతు ఇస్తుందని ఆయన అన్నారు. గాజా శాంతి విషయంలో ట్రంప్ నాయకత్వాన్ని మోడీ అభినందించారు.