AI ట్రాఫిక్ సిగ్నల్.!

Spread the love

AI Traffic Signal: ఏదో కొత్త టెక్నాలజీ వచ్చింది.. అందరికీ అందుబాటులోకి రావాలంటే ఇంకా చాలా టైం పడుతుంది.. చూద్దాంలే.. చేద్దాంలే అని ఆలోచన చాలా మందిలో ఉంది. ఇక నుంచి అలాంటి ఆలోచన మానుకోవాల్సిందే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మన జీవితంలో భాగం అయిపోయింది అనటానికి ఇండియాలోని ఈ అంశమే ఉదాహరణ. రోడ్డెక్కితే ట్రాఫిక్.. ట్రాఫిక్.. ఇది అందరికీ కామన్. ఇలాంటి ట్రాఫిక్ విభాగంలో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది.. ట్రాఫిక్ సిగ్నల్స్ కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటీ తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ నౌ.

ఇది రాజస్థాన్ రాష్ట్రం ఉదయ్ పూర్ సిటీ. ఈ నగరంలోని ట్రాఫిక్స్ సిగ్నల్స్ కు AI.. ఆర్టిషిఫియల్ ఇంటెలిజెన్స్ అనుసంధానం చేశారు. జంక్షన్ దగ్గర అధునాతనమైన కెమెరాలు అమర్చారు. ఈ కెమెరాలు సెన్సార్ లతో పని చేస్తాయి. జంక్షన్ చుట్టూ నాలుగు లైన్లు ఉంటాయి కదా.. ఈ నాలుగు లైన్లలోని ట్రాఫిక్ రద్దీని కెమెరాలు చూస్తూ ఉంటాయి. ఎటు వైపు రద్దీ ఎక్కువగా ఉంది అనే సెన్సార్ల ద్వారా గుర్తించి.. అటు వైపు ఆటోమేటిక్ గా గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.

ఇది అవసరమైన దానికంటే ఎక్కువసేపు ఉండాలి” అని ఆలోచిస్తూ మనం ఎన్నిసార్లు గ్రీన్ ట్రాఫిక్ లైట్ కోసం వేచి ఉన్నాము? ట్రాఫిక్ లైట్లు తరచుగా పాతవిగా, అసమర్థంగా , నిరాశపరిచినట్లు అనిపిస్తాయి – కానీ అవి అలా ఉండనవసరం లేకపోతే? ట్రాఫిక్ సిగ్నల్స్ అనేవి వాహనాలు మరియు పాదచారుల ప్రవాహాన్ని నియంత్రించడానికి రంగు లైట్లను ఉపయోగించే దృశ్య సహాయాల సమితి, ఇవి ఒకేసారి బహుళ దిశల ట్రాఫిక్ ప్రవాహానికి సరైన మార్గాన్ని నిర్వహింబడి ఉంటాయి. బాగా సమన్వయంతో కూడిన సిగ్నల్స్ జర్నీ సమయాన్ని మెరుగుపరుస్తాయి, రహదారి భద్రతను పెంచుతాయి మరియు ట్రాఫిక్ నిర్గమాంశను ఆప్టిమైజ్ చేస్తాయి.

అయితే, ట్రాఫిక్ సిగ్నల్స్ సరైన సమయంలో లేనప్పుడు, అవి వ్యతిరేక ప్రభావాన్ని చూపుతాయి – రద్దీని కలిగిస్తాయి, ఉద్గారాలను పెంచుతాయి మరియు కూడళ్లను మరింత ప్రమాదకరంగా మారుస్తాయి. కొన్ని సందర్భాల్లో, ట్రాఫిక్‌లో ఊహించని పెరుగుదల వంటి నిజ-సమయ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోని కఠినమైన సమయ చక్రాలు అసమర్థ ప్రవాహానికి దారితీయవచ్చు. ఆలస్యాన్ని తగ్గించడానికి బదులుగా వాటిని పెంచుతాయి.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న నగరాలు, అనేక భారతీయ నగరాలు సహా, కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత డైనమిక్ ట్రాఫిక్ సిగ్నల్‌లతో ప్రయోగాలు చేస్తున్నాయి. ఈ వ్యవస్థలు ట్రాఫిక్ ప్రవాహాన్ని ఆప్టిమైజ్ చేయడానికి సెన్సార్లు, కెమెరాలు, బహుళ కనెక్ట్ చేయబడిన పరికరాల నుండి AI, మెషిన్ లెర్నింగ్ మరియు రియల్-టైమ్ డేటాను ఉపయోగిస్తాయి. స్టాటిక్ సిస్టమ్‌లా కాకుండా, ఈ సిగ్నల్‌లు ప్రత్యక్ష ట్రాఫిక్ పరిస్థితుల ఆధారంగా సమయాలను సర్దుబాటు చేస్తాయి, ప్రయాణ సమయం, కాలుష్యాన్ని తగ్గిస్తాయి.

ఉదాహరణకు లెఫ్ట్ సైడ్ ట్రాఫిక్ రద్దీగా ఉంది.. రైట్ సైడ్ ట్రాఫిక్ తక్కువగా ఉంది. మామూలుగా అయితే ట్రాఫిక్ ఎలా ఉన్నా ఆల్టర్ నేట్ గా సిగ్నల్ ఇస్తూ ఉంటుంది ఇప్పుడు ఉన్న సిగ్నల్ వ్యవస్థ. కొత్తగా వచ్చిన AI ట్రాఫిక్ సిగ్నల్స్.. ఇలాంటి ఆటోమేటిక్ సిస్టమ్ కింద పని చేయదు. ఎటు వైపు రద్దీ ఎక్కువగా ఉందో అటు వైపు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. సో.. జంక్షన్ దగ్గర ఇక నుంచి 30 సెకన్లు.. 60 సెకన్లు.. 90 సెకన్లు అనే టైం డ్యూరేషన్ ఉండదు.. రద్దీ ఎటువైపు ఎక్కువగా ఉంటే అటు వైపు ముందుగా క్లియర్ చేస్తుంది. ఆ తర్వాతనే మిగతా లైన్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.

రాజస్థాన్ రాష్ట్రం ఉదయ్ పూర్ సిటీలో.. ట్రయిల్ రన్ నిర్వహిస్తున్నారు. ఒక్కో జంక్షన్ లో AI ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయటానికి 10 లక్షల రూపాయలు ఖర్చవుతుందని.. ఉదయ్ పూర్ సిటీ ట్రాఫిక్ డీఎస్పీ అశోక్ అంజనా తెలిపారు. . మరి ఉదయ్ పూర్ వరకు వచ్చిన AI ట్రాఫిక్ సిగ్నల్స్.. మన హైదరాబాద్ సిటీకి రావటం ఎంతోసేపు పట్టదు కదా.. ఇలా దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో ఇలాంటి ఏఐ ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ అందుబాటులోకి వస్తే రోడ్లపై రద్దీని మెరుగ్గా, సమర్థవంతంగా నిర్వహించటం అధికారులకు కూడా సులభతరం అవుతుంది. AI Traffic Signal.

మరి ఎమర్జన్సీ సర్వీసుల సంగతి ఏంటీ అనే డౌట్ రావొచ్చు.. అదే అంబులెన్స్ లు, అగ్నిమాపక వాహనాలు, పోలీస్ పెట్రోలింక్ వెహికల్స్ ఇలాంటివి ఏంటీ అంటారా.. ఆయా వాహనాలు ఇచ్చే సైరన్స్.. ఆయా వాహనాలపై ఉండే లైట్లు ఆధారంగా.. ఆటోమేటిక్ గా ఆ లైన్.. ఆ రహదారికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. సో.. నో ప్రాబ్లమ్ అన్నమాట.