ఒకప్పుడు సౌత్ హీరోలు అంటే మన రాష్ట్రాల్లోనే ఎక్కువ క్రేజ్ ఉండేది. కానీ గత పదేళ్లలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు సౌత్ హీరోలకు కేవలం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ప్రాంతాల్లోనే కాదు… నార్త్ లో కూడా విపరీతమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. హిందీ ప్రేక్షకులు సైతం మన హీరోల సినిమాల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. థియేటర్లలోనే కాదు, ఓటిటీల్లో కూడా సౌత్ సినిమాలు భారీ వ్యూస్ సాధిస్తున్నాయి. అందుకు బెస్ట్ ఉదాహరణ అల్లు అర్జున్ పుష్ప, రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ ఇంకా యాష్ కెజిఫ్…ఇలా ఇంకో డజన్ వరకు మంచి సినిమాలు ఉన్నాయ్! అవి హిందీ లో అదరగొట్టి మన హీరోల వేల్యూ ని పెంచాయి! అందుకే ఇప్పుడు హిందీ బెల్ట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన టాప్ సౌత్ స్టార్స్ ఎవరెవరంటే? ఒక్కసారి చూద్దాం…
గత కొన్నేళ్లలో హిందీ ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ముఖ్యంగా RRR సినిమా ఆయన కెరీర్‌లో ఒక పెద్ద మలుపు. ఆ సినిమాలో చూపించిన ఎనర్జీ, నటన, డ్యాన్స్ అన్ని కలిసి ఆయనను నార్త్ ఆడియన్స్‌కు మరింత దగ్గర చేశాయి. ఆ తర్వాత వచ్చిన ‘దేవర’ సినిమా కూడా హిందీ ప్రేక్షకుల్లో మంచి చర్చకు దారి తీసింది.
ఇక ఇప్పుడు ఆయన బాలీవుడ్‌లో నేరుగా ఎంట్రీ ఇస్తూ War 2 సినిమాలో నటించాడు. సినిమా హిట్ అవ్వకపోయినా, NTR డాన్స్, యాక్షన్, ఇంటెన్స్ పాత్రల్లో కనిపించిన తీరు నార్త్ ఆడియన్సు కి నచ్చేసింది అందుకే అయన మల్లి ఎప్పుడు హిందీ సినిమా చేస్తాడో అని హిందీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక నెక్స్ట్ తమిళ స్టార్ దళపతి విజయ్ కూడా హిందీ బెల్ట్‌లో మంచి గుర్తింపు సంపాదించారు. ఆయన సినిమాలు నేరుగా పాన్ ఇండియా రిలీజ్ కాకపోయినా, డబ్బింగ్ వెర్షన్ల ద్వారా భారీ స్థాయిలో వ్యూస్ సాధించాయి. ముఖ్యంగా యాక్షన్ థ్రిల్లర్ కథల్లో ఆయన స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్ నార్త్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఇప్పటికే ఆయన రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో, ఆయన చివరి చిత్రం అని ప్రచారం జరుగుతున్న ‘జన నాయగన్’ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తరవాత కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చి ఒక్క సినిమాతోనే దేశవ్యాప్తంగా స్టార్‌గా మారిన హీరో యష్. KGF: Chapter 1, KGF: Chapter 2 సినిమాల తర్వాత ఆయన పేరు నార్త్ ఇండియాలో మార్మోగింది. ఆ సినిమాల్లో ఆయన చూపించిన రాకింగ్ స్టార్ ఇమేజ్ హిందీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.ఇప్పుడు ఆయన తదుపరి సినిమా Toxic కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇక సెకండ్ ప్లేస్ లో మాత్రం ఒకప్పుడు హిందీ ప్రేక్షకులకు పెద్దగా తెలియని పేరు ప్రభాస్ ఉన్నాడు. కానీ Baahubali: The Beginning, Baahubali 2: The Conclusion సినిమాల తర్వాత ఆయన దేశవ్యాప్తంగా ఫేవరెట్ స్టార్ అయ్యారు. బాహుబలి పాత్ర ఆయనకు నెక్స్ట్ లెవెల్ గుర్తింపు తెచ్చింది.మరి ఫస్ట్ ప్లేస్ ఎవరిదో తెలుసా???
హిందీ ప్రేక్షకుల్లో అత్యధిక పాపులారిటీ సంపాదించిన సౌత్ స్టార్‌గా అల్లు అర్జున్ నిలిచారు. Pushpa: The Rise, Pushpa 2: The Rule సినిమాలు ఆయనను హిందీ బెల్ట్‌లో సూపర్ స్టార్‌గా నిలబెట్టాయి. ముఖ్యంగా ‘పుష్ప’లోని స్టైల్, డైలాగ్స్, మ్యానరిజంలు నార్త్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.ఇప్పుడు ఆయన దర్శకుడు Atleeతో చేయబోయే కొత్త సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి, సౌత్ హీరోల ప్రభావం ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించింది. మంచి సినిమాలతో వారు హిందీ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటున్నారు. అందుకే ఒకప్పుడు హిందీ సినిమాలంటేనే ఇండియన్ సినిమాలు అనుకునే వేరే దేశం వాళ్ళు, ఇప్పుడు మన హీరోల గురించి బాగా తెలుసుకున్నారు… జపాన్, చైనా లో కూడా మన సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.