బంగ్లాదేశ్‌లో ఆగని హత్యాకాండ…మరో హిందువు బలి…!

Spread the love

బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై సాగుతున్న దమనకాండలో మరో దారుణం చోటుచేసుకుంది. షరియత్‌పూర్ జిల్లా క్యూర్‌బంగా బజార్‌లో ఫార్మసీ నడుపుతున్న హిందూ వ్యాపారి ఖోకన్ చంద్ర దాస్, దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ… ఈరోజు ఉదయం కన్నుమూశారు. వ్యాపారం ముగించుకుని ఆటోలో ఇంటికి వెళ్తున్న ఖోకన్‌ను అడ్డగించిన దుండగులు, పదునైన ఆయుధాలతో దాడి చేయడమే కాకుండా ఆయన తలపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.ప్రాణరక్షణ కోసం ఆయన మంటలతోనే పక్కనే ఉన్న చెరువులోకి దూకినప్పటికీ, అప్పటికే శరీరం తీవ్రంగా కాలిపోవడంతో ఆసుపత్రిలో మరణించారు.విద్యార్థి నాయకుడు ఉస్మాన్ హాదీ హత్య తర్వాత దేశంలో నెలకొన్న ఉద్రిక్తతల సాకుతో దీపూ చంద్ర దాస్, సామ్రాట్, బజేంద్ర బిశ్వాస్ వంటి హిందువులను వరుసగా పొట్టనబెట్టుకుంటున్న ఘటనలు అక్కడి మైనారిటీలలో తీవ్ర భయాందోళనలు కలిగిస్తున్నాయి.