మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు’ విడుదలకు సిద్ధమైంది.సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో వెంకటేష్ ఒక కీలక పాత్రలోనటిస్తున్నారు.ఇందులో నయనతార కథానాయికగా నటిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా ప్రచారంలో భాగంగా చిత్రబృందం తాజాగా ‘వరప్రసాద్ టీమ్’ పేరుతో ఒక ఆసక్తికరమైన పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో చిరంజీవి వెనుక హర్షవర్ధన్, కేథరిన్, అభినవ గోమఠం వంటి నటీనటులు కనిపిస్తున్నారు. ఓవర్సీస్ బుకింగ్స్ అప్పుడే జోరందుకున్నాయి, కేవలం యూఎస్‌లోనే ఇప్పటికే 5వేలకు పైగా టికెట్లు అమ్ముడై సినిమాపై ఉన్న క్రేజ్‌ను చాటుతున్నాయి.
సినిమా విడుదలకు కేవలం 9 రోజులే సమయం ఉండటంతో అనిల్ రావిపూడి అండ్ టీమ్ భారీ ప్రచారానికి ప్లాన్ చేశారు. జనవరి 3న రాజమహేంద్రవరం నుండి ప్రారంభమయ్యే ఈ యాత్ర వరుసగా తిరుపతి, నెల్లూరు, విశాఖపట్నం, హైదరాబాద్, తాడేపల్లిగూడెం, అనంతపురం, వరంగల్ బెంగళూరు నగరాల్లో సాగనుంది. ముఖ్యంగా తిరుపతి వేదికగా 2 నిమిషాల 30 సెకన్ల నిడివి గల ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు.ఈ యాత్రలోని కొన్ని ప్రధాన వేదికలపై చిరంజీవి స్వయంగా పాల్గొని అభిమానులను ఉత్సాహపరచనున్నారు. ఒకవైపు బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ ఉన్న నేపథ్యంలో, ఈ 9 రోజుల మెరుపు ప్రచారం సినిమాను ఏ స్థాయిలో నిలబెడుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది.