జపాన్ లో భారీ భూ కంపం సంభవించింది. ఆ దేశ ఉత్తర తీర ప్రాంతంలో సంభవించిన ఈ భూ కంపం రిక్టర్ స్కేల్ పై 7.4గా నమోదైంది. ఈ నేపథ్యంలో సునామీ హెచ్చరికలు జారీచేయబడ్డాయి. తీర ప్రాంతంలో అలలు 3 మీటర్ల వరకు ఎగసిపడవచ్చని జపాన్ మెట్రోలాజికల్ ఏజెన్సీ తెలిపింది. జపాన్ సమయం ప్రకారం సాయంత్రం 4.50 దాటిన తరువాత నార్త్ జపాన్ లోని సన్రికు ప్రాంతంలో భూ కంపం సంభవించింది. సముద్ర మట్టం నుండి 10 కిలో మీటర్ల లోతులో భూ కంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రజలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. మళ్లీ తమ ఆదేశాలు ఇచ్చే వరకు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ప్రజలకు సూచించారు. భూ కంపం తరువాత జపాన్ నార్త్ ప్రాంతాలలో కొన్ని చోట్ల అలలు ఎగసిపడ్డాయి. ప్రధానంగా ఇవాటే, అఒమోరి మరియు హొక్కైడో తీర ప్రాంతాలకు అలాగే మియాగి మరియు ఫుకుషిమా తీరాలకు స్వల్ప స్థాయి హెచ్చరికలు జారీ అయ్యాయి.ఇక జపాన్ లో భూ కంపం వలన జారీ చేసిన సునామీ హెచ్చరికల ప్రభావం మన దేశంపై ఉండదని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ తెలిపింది.