రాజస్థాన్  పచ్ పద్ర లోని ఆయిల్ రిఫైనరీలో అగ్నిప్రమాదం 

Spread the love

రాజస్థాన్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బలోత్రా జిల్లా పచ్ పద్ర లోని ఆయిల్ రిఫైనరీలో  భారీగా మంటలు ఎగసిపడ్డాయి. మంటలను అదుపులోకి తీసురావాడానికి అగ్నిమాపక సిబ్బంది కృషి చేస్తున్నారు. రేపు ప్రధాని మోడీ ఈ రిఫైనరీని ప్రారంభించాల్సి ఉంది. ఇక ఈ అగ్నిప్రమాదం నేపథ్యంలో రేపు ప్రారంభోత్సవం జరగడంపై అనిశ్చితి నెలకొంది.  దేశంలోనే మొదటి  గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌గా దీనిని నిర్మించారు. హెచ్‌పీసీఎల్, రాజస్థాన్ ప్రభుత్వాల ఉమ్మడి  భాగస్వామ్యంతో సుమారు రూ.79,459 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్టును తీసుకొచ్చారు. ఇది ఏడాదికి 9 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన ఒక గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ-కమ్-పెట్రోకెమికల్ కాంప్లెక్స్. దీని పెట్రోకెమికల్ ఉత్పత్తి సామర్థ్యం 2.4 మిలియన్ మెట్రిక్ టన్నులు. దీని ద్వారా ఎగుమతులు మరియు దేశీయ మార్కెట్ల కోసం పాలీప్రొఫైలిన్ , పాలిథిలిన్ వంటి అధిక విలువ కలిగిన పాలిమర్‌లను మరియు వివిధ రకాల పెట్రో-ఇంటర్మీడియట్ ఉత్పత్తులను తయారు చేయవచ్చని తెలుస్తోంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *