చైనాలోని ఓ పాఠశాలలో నోరో వైరస్ కేసుల నమోదు కలకలం రేపింది. 100 మందికి పైగా విద్యార్థులు అనారోగ్యానికి గురికావడంతో డాక్టర్లు రంగంలోకి దిగి పరీక్షలు నిర్వహించారు. ఈ టెస్టుల్లో 100 మందికి పైగా విద్యార్థులకు ‘నోరా వైరస్’ సోకినట్లు తేలింది. దీంతో ఎలర్ట్ అయిన అధికార యంత్రాంగంతరగతి గదులతో పాటు బడి ఆవరణలో వైరస్ ను నాశనం చేసే మెడిసిన్ ను వెదజెల్లారు. వైరస్ బాధిత స్టూడెంట్స్ కు ట్రీట్మెంట్ ఇస్తూనే మిగతా విద్యార్థులకు వైరస్ సోకకుండా చర్యలు చేపట్టారు. బాధిత స్టూడెంట్స్ అందరూ కోలుకుంటున్నారని వివరించారు. రోజూ విద్యార్థుల ఆరోగ్యాన్ని పరీక్షిస్తూ ప్రత్యేక హాజరు తీసుకుంటున్నట్లు తెలిపారు. బడి పరిసరాల్లోని నివాస సముదాయాల్లో ఉంటున్న వారికి వైరస్టెస్టులు చేపట్టినట్లు వివరించారు. ఏటా అక్టోబర్ నుంచి మార్చి మధ్య ప్రావిన్స్ లో నోరో వైరస్ విజృంభిస్తుందని అధికారులు తెలిపారు. వైరస్ బాధితులు ప్రధానంగా వాంతులు, విరేచనాలతో బాధపడుతుంటారని చెప్పారు. ఈ వైరస్ సాధారణమైందేనని, వైరస్ వ్యాప్తి చాలా వేగంగా ఉంటుందని వివరించారు.