అమెరికాకు పెట్టుబడులు తీసుకువచ్చేది భారత్ అని పాకిస్థాన్ కాదని అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు, రిపబ్లికన్ పార్టీ నేత రిచ్ మెక్కార్మిక్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా భారత్ తో సత్సంబంధాలు కలిగి ఉండాలన్నారు.ఎందరో ట్యాలెంటెడ్ నిపుణులు, ఉద్యోగులు అమెరికాకు భారత్ ఇస్తుందని పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో వారి పాత్ర ఎంతో కీలకమని స్పష్టం చేశారు. అమెరికన్ కంపెనీలు కూడా భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు వస్తాయని భారత్ ను దూరం చేసుకుంటే అమెరికాకే నష్టమని తేల్చిచెప్పారు. అయితే రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లను తగ్గించమని అమెరికన్ ప్రెసిడెంట్ ఎన్నిసార్లు చెప్పినా భారత్ ఆ పని చేయకపోవడం నచ్చట్లేదని పేర్కొన్నారు. దాని కారణంగానే ట్రంప్ భారత్ తో కఠినంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. అయితే భారత ప్రధాని నరేంద్రమోడీ మాత్రం తమ దేశ ప్రయోజనాల కోసం ఆలోచించి తక్కువ ధరకే రష్యా నుంచి ఆయిల్ కొనేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు.