వీసా హక్కు కాదు..ఒక అనుమతి మాత్రమే:అమెరికా విదేశాంగ శాఖ

Spread the love

అమెరికా విదేశాంగ శాఖ కఠిన వీసా రూల్స్ పై మరోసారి స్పందించింది. వీసా అనేది హక్కు కాదని విదేశీ టూరిస్టులు దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడితే దానిని రద్దు చేస్తామని హెచ్చరించింది. వీసాల జారీ అంశంలో విధానాన్ని మరింత కఠినతరం చేసిన విషయం విదితమే. గత నెల అనేక దేశాలకు వీసాలను నిలిపివేసింది. స్టూడెంట్స్, జర్నలిస్టులు, టూరిస్టులు ఇలా అందరికీ ఇది వర్తిస్తుందని తెలిపింది. గత ఏడాదిలో చాలా వీసాలు రద్దు చేసినట్లు తెలిపింది. వీసా అనేది హక్కు కాదు. దీనికి రాజ్యాంగబద్దమైన హక్కు లేదు. టూరిస్టులకు మా దేశంలోకి ప్రవేశించేందుకు అనుమతి మాత్రమే. ఈ విషయాన్ని తరచుగా చెబుతున్నప్పటికీ కొందరు అర్ధం చేసుకోలేకపోతున్నారని పేర్కొంది. టూరిస్టుల ముసుగులో తమ దేశంలోకి ప్రవేశించి తమ జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకమైన చర్యలకు పాల్పడితే వారి వీసాను రద్దు చేస్తామని అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో తెలిపారు.