క్రీడలు దేశాలను ప్రజలను ఏకం చేస్తాయని నెల్సన్ మండేలా వంటి దిగ్గజాలు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇంతక ముందు పరిస్థితులు వేరు. చిరకాల ప్రత్యర్థులైన భారత్-పాకిస్థాన్ మధ్య పహల్గామ్ దాడి ఆపరేషన్ సింధూర్ తదనంతర పరిణామాల తర్వాత పరిస్థితులు మరింత క్షీణించిన సంగతి తెలిసిందే. పాక్ ఆటగాళ్లు భారత ఆటగాళ్లు చేతులు కలిపేందుకు కూడా నిరాకరించిన సంగతి తెలిసిందే. అలాగే ఆ దేశ ప్రతినిధుల నుండి ఆసియా కప్ ను కూడా తీసుకోలేదు. పురుషుల క్రికెట్లో ప్రారంభమైన నిరసనల పరంపర మహిళల ఆసియా కప్లో కూడా రిపీట్ అయింది. ఇటీవల శ్రీలంకపై విజయం సాధించిన భారత మహిళా క్రికెట్ జట్టు, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించేందుకు భారత్ రెండు సార్లు నిరాకరించింది. మొదట పురుషుల ఆసియా కప్ ఫైనల్లో కూడా భారత ఆటగాళ్లు ఇలాంటి వైఖరినే ప్రదర్శించారు. పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేసేందుకు కూడా భారతీయ క్రీడాకారులు నిరాకరిస్తూ వస్తున్నారు. తటస్థ వేదికైన దుబాయ్ లో జరిగిన ఈ టోర్నమెంట్లలో ట్రోఫీ ప్రెజెంటేషన్ వేదికపైకి వెళ్లకుండా భారత జట్లు బహిష్కరించడం అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. పురుషుల క్రికెట్ లో జరిగిన సీన్ మహిళల ఆసియా కప్ లో కూడా రిపీట్ అయింది. ఈ క్రమంలో భారత్-పాక్ అంశంపై మాజీ క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ స్పందించారు. పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయవద్దని భారత ప్రభుత్వం నిర్ణయిస్తే మరొక ఆప్షన్ లేదని ప్రభుత్వం ఏది చెబితే అది పాటించాలని కపిల్ అన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించడం ప్రతి ఆటగాడి బాధ్యత అని, ఇందులో ఎలాంటి ఇతర ప్రత్యామ్నాయాలు ఉండవని ఆయన స్పష్టం చేశారు. క్రీడాకారులు ఎప్పుడూ దేశ ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. ఇక పాక్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ప్రస్తుత పరిస్థితిపై స్పందిస్తూ ఇమ్రాన్ ఖాన్ ను కనీసం మానవత్వంతో అయినా పట్టించుకుని వైద్య సాయం అందించాలని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇమ్రాన్ ఖాన్ కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాజీ దిగ్గజ క్రికెటర్ల నుండి మద్దతుగా స్పందన వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు క్రికెటర్లు దీనిపై మాట్లాడారు. ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం రావల్పిండిలోని అడియాలా జైలులో ఖైదీగా ఉన్నారు. 2023 ఆగస్టు నుండి ఆయన వివిధ కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఆయన ప్రస్తుత పరిస్థితిపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాజీ క్రికెట్ దిగ్గజాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా కనీసం మానవతా దృక్పథంతో ఆయనకు సరైన సదుపాయాలు కల్పించాలని పలువురు ప్రముఖులు కోరుతున్నారు. ఒక క్రీడాకారుడిగా ఆయన దేశానికి అందించిన సేవలను దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుత న్యాయపరమైన చిక్కుల్లోనూ ఆయనకు సరైన మానవతా హక్కులు దక్కాలని క్రీడా ప్రపంచం ఆకాంక్షిస్తోంది.