New Year కి Special ఏంలేదా అనుకునే time లో మన Star Star Mega Star చిరంజీవి సినిమా హిట్లర్ re release కి రెడీ అయ్యింది … 1 st january 2025 date గుర్తుపెట్టుకోండి .. Theaters లో పూనకాలే అని చెప్పొచ్చు ,, అయితే ఈ సినిమా 1997 లో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చింది.
ఎడిటర్ మోహన్ సమర్పించగా ఎం. ఎల్. మూవీ ఆర్ట్స్ పతాకంపై ఎం. వి. లక్ష్మి నిర్మించిన ఈ చిత్రంలో చిరంజీవి, రంభ ప్రధాన పాత్రలు పోషించారు. నటుడు, రచయిత ఎల్. బి. శ్రీరామ్ ఈ చిత్రానికి సంభాషణలు అందించాడు. ఈ చిత్రం 42 కేంద్రాల్లో శతదినోత్సవం పూర్తి చేసుకుంది. 1996 లో మలయాళం లో ఇదే పేరుతో వచ్చిన విజయవంతమైన చిత్రం తెలుగు చిత్రానికి మూలం. మలయాళంలో మమ్ముట్టి, శోభన జంటగా నటించారు. Don’t miss It ..