సూర్య కొత్త సినిమా టైటిల్ ఇదే..!

Spread the love

వరుసగా ‘కరుప్పు’,’విశ్వనాథన్ అండ్ సన్స్’ సినిమాలతో భారీ విజయాన్ని అందుకున్నారు సూర్య. తమిళంతో పాటు తెలుగులో కూడా సూర్యకు భారీ ప్రేక్షకాదరణ ఉంది. రెండు దశాబ్దాలకు పైగా ఆయన సినిమాలు ఇక్కడ కూడా ఘన విజయాలను అందుకుంటూ ఇక్కడి అగ్ర హీరోలతో సమానంగా విజయవంతమవుతున్నాయి. తనదైన నటనతో అలరిస్తూ ముందుకు సాగుతున్నారు. ‘శివపుత్రుడు’తో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న సూర్య, ‘గజినీ’తో తెలుగు సినీ చరిత్రలోనే ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు. ఆ తర్వాత ‘యముడు’, ’24’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో అలాగే  ‘ఆకాశం నీ హద్దురా’, ‘జై భీమ్’ లాంటి సినిమాలతో క్లాస్ ప్రేక్షకులను అలరించారు. కేవలం స్టార్‌డమ్‌కే పరిమితం కాకుండా, ప్రతి చిత్రంలోనూ తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకుంటూ రెండు దశాబ్దాలకు పైగా ఎంటర్టైన్ చేస్తూ దూసుకుపోతున్నారు. 

ప్రస్తుతం ఆయన జితు మాధవన్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. దీనికి సీన్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాకు ‘సీన్’ అనే టైటిల్ ఖరారు చేశారు. నజ్రియా ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్నారు. ఆనంద్ రాజ్, నస్లెన్, రాజ్ ప్రియన్, లాల్ తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను 2D ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు. దీపావళికి ప్రేక్షకుల ముందుకు రావడం కూడా సినిమాలకు కలిసొచ్చే అంశం. కుటుంబ ప్రేక్షకులు ముఖ్యంగా యూత్ థియేటర్లకు రావడానికి ఆసక్తి చూపుతారు. పట్టణాల్లో కుటుంబ సమేతంగా పండుగ షాపింగ్, వినోదం కోసం సినిమా థియేటర్లను ఎంచుకునే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా లాంగ్ వీకెండ్ వల్ల మంచి ఓపెనింగ్స్ వస్తాయి. ఎంటర్‌టైన్‌మెంట్ / ఫ్యామిలీ సినిమాలకు డిమాండ్: పండుగ వాతావరణానికి తగినట్లుగా కామెడీ, రొమాంటిక్ ఎంటర్‌టైనర్, లేదా కమర్షియల్ మాస్ సినిమాలకు ప్రేక్షకులు పెద్దపీట వేస్తారు. ఇక తెలుగులో స్ట్రెయిట్ సినిమాలతో పాటు తమిళ డబ్బింగ్ సినిమాలు కూడా దీపావళికి గట్టి పోటీ ఇస్తున్నాయి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *