అల్లు అర్జున్ విషయంలో అలా చేయాల్సింది..
పురందేశ్వరి కామెంట్స్..
హీరో అల్లు అర్జున్ విషయంలో విచారణ తర్వాత యాక్షన్ ఉండాల్సిందని రాజమండ్రి ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. సంధ్య థియేటర్ ఘటన స్థలంలో పోలీసుల రక్షణ సరిగ్గా లేదని తెలుస్తుందన్నారు. మరోవైపు బీజేపీ అంబేద్కర్ ను గౌరవించే పార్టీ అని, రాజ్యాంగాన్ని స్వలాభం కోసం తాము మార్చడం లేదని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ గతంలో తమ స్వలాభం కోసం రాజ్యాంగ సవరణలు చేసిందన్నారు. ఏపీలో బిజెపి సభ్యత్వాలు 25 లక్షలు చేరుకున్నాయని తెలిపారు. భారీ ఎత్తున సభ్యత్వాలు అటల్ బిహారీ వాజ్ పాయ్ కి నివాళిగా భావిస్తున్నట్లు వెల్లడించారు.